ఫేడ్ ఆఫ్ దశలో దూసుకుపోతున్న సీనియర్ బ్యూటీ..!
ఫేడ్ ఆఫ్ దశలో దూసుకుపోతున్న సీనియర్ బ్యూటీ..!

‘శ్రీ’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా.. తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఒక వైపు సీనియర్ హీరోలతో నటిస్తూనే మరోవైపు కుర్ర హీరోల సరసన మెరుస్తోంది. నవతరం హీరోయిన్లకు పోటీనిస్తూ ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే గోపిచంద్ హీరోగా నటిస్తున్న ‘సీటీమార్’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. అలానే తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘నవంబర్ స్టోరీ’ విడుదలకు సిద్ధమైంది. మిల్కీ బ్యూటీ డిజిటల్ డెబ్యూ అయిన ‘నవంబర్ స్టోరీ’ డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇవి కాకుండా తమన్నా చేతిలో మరో నాలుగైదు ఆఫర్స్ ఉన్నాయని తెలుస్తోంది.
టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించనున్న ‘గుర్తుందా శీతాకాలం’ అనే రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో తమన్నా నటిస్తోంది. ఇది కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. దీని కోసం మిల్కీబ్యూటీ సుమారు 2 కోట్ల వరకు తీసుకుంటోందని టాక్. అలానే ‘ఆహా’ యాప్ కోసం ’11త్ అవర్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ కోసం ఈ ముద్దుగుమ్మకు కోటి 80 లక్షలు ఇస్తున్నారట. దీంతో పాటు యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న ‘అంధాదున్’ తెలుగు రీమేక్ లో కూడా నటించనుంది. హిందీలో టబు పోషించిన రోల్ లో తమన్నా కనిపించనుంది. తమన్నా ది హీరోయిన్ రోల్ కాకపోయినప్పటికీ సినిమాలో చాలా కీలకమైనది కావడంతో కోటిన్నర పైనే డిమాండ్ చేస్తోందట. అలానే ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ లో కూడా నటించనుంది. ఏదేమైనా ఫేడ్ ఆఫ్ దశలో కూడా మిల్కీ బ్యూటీ ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here