Yadha-Krishna-Passes-Away
Yadha-Krishna-Passes-Away

టాలీవుడ్ లో ఒకప్పుడు అందరి నోట్లో నానిన నటుడు కమ్ నిర్మాత తాజాగా మరణించారు. ఒక వర్గం ప్రజలు ఎక్కువగా చూసే బిగ్రేడ్ సినిమాల్ని నిర్మిస్తూ.. అందులో హీరో పాత్రల్ని పోషిస్తూ.. గుర్తింపు పొందిన అరవై ఒక్క ఏళ్ల యాదా కృష్ణ బుధవారం కన్నుమూశారు. కొన్నేళ్ల క్రితం బి గ్రేడ్ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉండేది.

ఇప్పుడంటే ఓటీటీ ఫ్లాట్ పాం వచ్చింది కాబట్టి.. ఎవరికి వారు వారి మొబైల్ లోనే కోరుకున్నవన్ని చూసేశారు. అందుకు భిన్నంగా.. కొన్నేళ్ల క్రితం థియేటర్లు మాత్రమే దిక్కుగా ఉండేవి. ఆ రోజుల్లో గుప్త శాస్త్రం.. వయసు కోరిక.. పిక్నిక్ లాంటి బి గ్రేడ్ సినిమాల్ని తీశారు. దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన అనారోగ్యంతో బుధవారం మరణించారు.

ఒక సెక్షన్ ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన.. ఆ తర్వాత సంక్రాంతి అల్లుడు అనే ఫ్యామిలీ చిత్రంతో అన్ని వర్గాల వారి ఆదరణ పొందారు. అయితే.. వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరమైన ఆయన.. తాజాగా గుండెపోటుతో మరణించిన వైనం బయటకు వచ్చి.. దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన హఠాన్మరణం పలువురిని దిగ్భాంత్రికి గురి చేసింది.

Yadha-Krishna-Passes-Away

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here