పెళ్లి కుమార్తె నిహారికకు చిరంజీవి ఖరీదైన కానుక
పెళ్లి కుమార్తె నిహారికకు చిరంజీవి ఖరీదైన కానుక

పెళ్లి అనగానే వధూవరులకు చక్కని కానుకలు అందుతాయి. వేడుక అనంతరం తీరిగ్గా `ఎవరు ఏ కానుకలిచ్చారు?` అంటూ బంధుమిత్రులు తెచ్చిన కానుకల్ని వధూవరులు పరిశీలనగా చూసుకుని మురిసిపోతారు.

మరి నిహారిక పెళ్లి కానుకల్లో `స్పెషల్ గిఫ్ట్` ఎవరి నుంచి అందుతుందో ఊహించారా? ఇందులో ఎలాంటి సర్ ప్రైజ్ లేదు. కచ్ఛితంగా అది పెదనాన్న చిరంజీవి నుంచే అయ్యి ఉంటుంది. ఇప్పటికే తన సోదరుడు నాగబాబు కుమార్తె అయిన మెగా ప్రిన్సెస్ నిహారికకు మెగాస్టార్ చిరంజీవి ఓ ఖరీదైన కానుకను సిద్ధం చేశారట. అది ఏమిటి? అంటే.. డైమండ్ నెక్లెస్ అని తెలిసింది. దీని విలువ సుమారు కోటిన్నర ఉంటుందట. టాలీవుడ్ వెడ్డింగ్స్ లో ఇలాంటి కానుక ఇంతవరకూ వేరొకరికి అంది ఉండదు! అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి వరుడు చైతన్యకు చిరు ఎలాంటి కానుక ఇస్తున్నారు? అంటే అది కూడా మరింత సర్ ప్రైజ్ చేసేదిగా కాస్ట్ లీగా ఉంటుందని చెబుతున్నారు. రెండు కానుకలు చిరు వద్ద రెడీగా ఉన్నాయి. ఈనెల 9న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో జరిగే వెడ్డింగ్ లో ఈ కానుకలు అందనున్నాయట. పెళ్లి వేడుకలో ఈ కానుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఊహిస్తున్నారు.

నాగబాబు ఇంట ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని ఉదయ్ పూర్ కి మెగా ఫ్యామిలీ బయల్దేరనుంది. అక్కడ పెళ్లి వేడుక అయ్యాక.. హైదరాబాద్ లో రిసెప్షన్ ఉంటుంది. సంగీత్ లో మెగా సందడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు త్వరలో అంతర్జాలాన్ని షేక్ చేయనున్నాయి. మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో చిలౌట్ చేసే సందర్భాల్ని క్యాప్చుర్ చేసేందుకు కెమెరా కళ్లు వెతికేయడం గ్యారెంటీ అన్నమాట. ఇంతకీ మెగా గిఫ్టులపైనా ఫోటోగ్రాఫర్లు దృష్టి సారిస్తే బావుంటుందేమో!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here