నిహారిక వెడ్స్ చైతన్య.. ప్రత్యేక విమానంలో బయల్దేరారిలా..
నిహారిక వెడ్స్ చైతన్య.. ప్రత్యేక విమానంలో బయల్దేరారిలా..

నిహారిక వెడ్స్ చైతన్య.. హంగామా మామూలుగా లేదు. మెగా డాటర్ నిహారిక వివాహ మహోత్సవం డిసెంబర్ 9 సాయంత్రం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇప్పటివరకూ వధూవరుల ఇండ్లలోనే ప్రీవెడ్డింగ్ సంబరాలు సాగాయి. తాజా సమాచారం మేరకు ఇరు కుటుంబాలు ఉదయ్ పూర్ పయనమయ్యారు. నిహారిక.. చైతన్య కుటుంబ సభ్యులు ఈ ఉదయం ఉదయపూర్ కు చార్టర్డ్ విమానంలో బయల్దేరారు. వరుణ్ తేజ్ – నాగ బాబు-పద్మజ దంపతులుతో పాటు కొత్త జంట నిహారిక- చైతన్య ఈ విమానంలో ఉన్నారు. చైతన్య తల్లిదండ్రులు ఈ చార్టెడ్ విమానంలో కనిపించారు.

ఇక చిరంజీవి.. పవన్ కళ్యాణ్ సహా మొత్తం మెగా కుటుంబం ఈ వివాహానికి హాజరుకానుంది. మెగా హీరోలంతా పెళ్లి వేడుక ఆద్యంతం సందడి చేయనున్నారు. షూటింగులకు బ్రేక్ ఇచ్చి వేడుకను వీక్షించనున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి కాబట్టి బడా స్టార్లు ఎటెండయ్యే అవకాశం ఉంది.

niharika-weds-chaitanya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here