భారత్ బంద్ వేళ.. సీఎం కేసీఆర్ పాత ఇంటికి ఎందుకు వెళ్లారు?
భారత్ బంద్ వేళ.. సీఎం కేసీఆర్ పాత ఇంటికి ఎందుకు వెళ్లారు?

ఓవైపు భారత్ బంద్ సాగుతున్న వేళ.. తెలంగాణ అధికార పక్షానికి చెందిన మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా నేతలంతా పొద్దున్నే రోడ్ల మీదకు వెళ్లటం.. బంద్ ను విజయవంతం చేయటానికి పడిన కష్టం అంతాఇంతా కాదు. సాధారణంగా బంద్ అన్నంతనే ఉదయం 10 గంటల తర్వాత నుంచి షురూ చేసి.. మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిస్తుంటారు.

సాధారణంగా ఈ టైమింగ్ కు మించి ఎవరూ బంద్ చేయరు. అందుకు భిన్నంగా భారత్ బంద్ సందర్భంగా గులాబీ దళం వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. ఉదయం ఏడు గంటలకే టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చేసి హడావుడి మొదలు పెట్టేశారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ అధికారపక్ష నేతలంతా ఆందోళనలు.. రాస్తారోకోలు.. ధర్నాలు.. అంటూ హడావుడి చేస్తూ.. రోడ్లు మొత్తాన్ని గులాబీ మయం చేసేశారు.

బంద్ ను విజయవంతం చేసిన తర్వాత అలిసిపోయి ఇళ్లకు చేరుకున్నారు.మరి..భారత్ బంద్ కు మద్దతు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర సమాధానం వస్తుంది. బంద్ రోజున కేసీఆర్ తనరోటీన్ కార్యక్రమాలకు భిన్నమైన పని చేశారు. గతంలో ఆయన బంజారాహిల్స్ లోని నందినగర్లో ఉండేవారు. ఆ తర్వాత మారారు. మంగళవారంఆయన నందినగర్ లోని తన పాత ఇంటికి వెళ్లారు.

ఎందుకు వెళ్లినట్లు? అంటారా? ప్రస్తుతం ఆ పాత ఇంటిని కొత్తగా మారుస్తున్నారు. ఇంటిని పూర్తిగామారుస్తున్నారు. దీంతో.. అక్కడకు వెళ్లిన ఆయన అక్కడి పనుల్ని స్వయంగా పరిశీలించారు. మార్పులుచేర్పులు సూచించి.. ప్రగతిభవన్ కు చేరుకున్నారు. అందరు భారత్ బంద్ లో భాగస్వామ్యం అయితే.. దానికి పిలుపు ఇచ్చిన అధినేత.. అందుకు భిన్నమైన పనిలో ఉండటం గమనార్హం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here