షాకింగ్ : ఆ రియల్ హీరో ఆస్తులు తాకట్టు పెట్టాడట
షాకింగ్ : ఆ రియల్ హీరో ఆస్తులు తాకట్టు పెట్టాడట

కరోనా ఎప్పుడైతే మొదలైందో దేశమంతా అప్పుడే చిన్నాభిన్నం అయిన విషయం తెలిసిందే. మంది ప్రజలు కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందుల పాలయ్యారు. ఇక వలసకూలీల కష్టాలు చెప్పడానికి మాటలే లేవు. సొంతూరుకి చేరుకునేందుకు వాళ్లు వేలకు వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన విషయం మరచిపోలేము. చేసుకోవడానికి పనిలేక అబ్బాయిపై తినడానికి తిండి లేక వలసకూలీలు సామాన్య ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. ఆ సమయంలో వలస కూలీలు పేదల కష్టాలు చూసి చలించిపోయిన ప్రముఖ నటుడు సోనూసూద్ వందలాది మంది తన టీం సభ్యులు వెంటేసుకొని ఎవరి కష్టం అంటే వారి దగ్గరికి వెళ్లి వారికి ఆర్థిక సాయం అన్నదానం చేశారు.

వలస కూలీలు సొంతూళ్లకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులు ట్రైన్లు ఏకంగా విమానాలను కూడా బుక్ చేశాడు. వలస కూలీలను వారి వారి ప్రాంతాలకు చేర్చేందుకు సోనూసూద్ భారీగానే ఖర్చు పెట్టాడు. సినిమాల్లోకి వచ్చిన సోనూసూద్ తర్వాత భారీగానే సంపాదించాడని అందువల్లే ఇంత సాయం చేయగలిగాడని వార్తలు వచ్చాయి. మీడియా తో పాటు సోషల్ మీడియాలో సోనూ సూద్ ఆస్తులు రూ.వందల కోట్ల లో ఉన్నట్టు లెక్కలు వేసి మరీ వార్తలు వండి వార్చారు.

అయితే సోనుసూద్ గురించి తాజాగా ఓ షాకింగ్ నిజం తెలిసింది. అతడు తన ఆస్తులను తాకట్టు పెట్టినట్లు సమాచారం. ముంబైలో రూ 10 కోట్ల విలువ చేసే ఆరు ప్లాట్లను రెండు దుకాణాలను సోనూ తాకట్టు పెట్టాడట. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై నవంబర్ 24న రిజిస్టర్ చేశాడని ఆ ఆస్తులన్నీ తన భార్య సోనాలి పేరిట ఉన్నవని చెబుతున్నారు. ఇన్ని రోజులు రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి సోనూ వలస కూలీల కు సాయం చేశాడని అందరూ అనుకుంటుండగా ఇప్పుడు తన ఆస్తులను తాకట్టు పెట్టి మరీ సోనూ సూద్ వలస కూలీల కు సాయం చేశాడని అర్థమవుతోంది. ఈ విషయం తెలిసిన తరువాత నెటిజన్లు సినీ అభిమానులు మరోసారి సోనూ సూద్ ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here