నిహారిక పెళ్లి.. సందడంతా శ్రీజ కళ్యాణ్ దే
నిహారిక పెళ్లి.. సందడంతా శ్రీజ కళ్యాణ్ దే

కొణిదెల వారి వెడ్డింగ్ నుంచి ఒక్కో ఫోటో అంతర్జాలంలోకి వచ్చి షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో హాట్ కేక్ లా వైరల్ అయ్యింది. నాగబాబు డ్యాన్సింగ్ వీడియో నీహారిక స్టెప్పులేస్తున్న వీడియోలకు అంతే విజిబులిటీ దక్కింది. మెగాస్టార్ తన గారాల డాటర్ నిహారికకు 2కోట్ల విలువైన కానుక ఇచ్చినప్పటి ఫోటో కూడా ఇంటర్నెట్ ని షేక్ చేసింది.

తాజాగా మరో ఫోటో అంతే వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కళ్యాణ్ ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్న ఈ ఫోటో ఎంతో ప్లెజెంట్ గా కనిపిస్తోంది. ఇందులో శ్రీజ సిగ్గుల మొగ్గవుతూ కనిపిస్తున్నారు.

శ్రీజ-కళ్యాణ్ జంట ఈ వివాహ వేడుక ఆద్యంతం ఎంతో సరదాగా సందడి చేస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం హీరోగా రాణించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసినదే. సోదరి సుశ్మిత తరహాలోనే శ్రీజ కూడా సినీనిర్మాణంపై దృష్టి సారించనున్నారని సమాచారం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here