ట్రైలర్ టాక్: 'డర్టీ హరి' అంత డర్టీగా ఏమీ లేదు..!
ట్రైలర్ టాక్: 'డర్టీ హరి' అంత డర్టీగా ఏమీ లేదు..!

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘డర్టీ హరి’. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి – రుహానీ శర్మ – సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు. గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో సతీష్ బాబు – సాయి పునీత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ విశేషమైన ఆదరణ పొందాయి. డిసెంబర్ 18న ‘ఫ్రైడే మూవీస్’ అనే డిజిటల్ వేదికపై ‘డర్టీ హరి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

‘డర్టీ హరి’ మూవీ ట్రైలర్ ని చూస్తే ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు సస్పెన్స్ కూడా ఉందని అర్థమవుతోంది. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జత చేసి ఆద్యంతం యూత్ ని ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ ని కట్ చేశారు. మొదటి ట్రైలర్ ని బోల్డ్ గా చూపించిన చిత్ర యూనిట్.. సెకండ్ ట్రైలర్ తో ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మార్క్.కె.రాబిన్ అందించిన నేపథ్య సంగీతం.. ఎం.ఎన్.బాల్ రెడ్డి విజువల్స్ బాగున్నాయి. జునైద్ సిద్ధిఖి ఎడిటింగ్ వర్క్ చేశారు. నేటి యువతను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలంటే ఈ నెల 18 వరకు ఆగాల్సిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here