నిహారిక పెళ్లి.. పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ కపుల్
నిహారిక పెళ్లి.. పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ కపుల్

కుందనపు బొమ్మ నిహారిక పెళ్లిలో ముచ్చటైన జంట ఎవరు? పెళ్లిలో అతిథులు ప్రేక్షక మహాశయుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన జంట ఎవరు? కాంపిటీషన్ పెడితే ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఎవరికి దక్కుతుంది? అంటే నిశ్శందేహంగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహ జంటకే అందరి ఓటు. క్యూట్ లవ్ లీ పెయిర్ గా పెళ్లి వేడుక ఆద్యంతం సందడి చేసింది ఈ లవ్ లీ జోడీనే.
కేవలం మెగా కుటుంబం నుంచి 10 జంటలు పైగా ఈ వేడుకకు అటెండ్ కాగా.. అందులో సంథింగ్ స్పెషల్ జంటగా అల్లు అర్జున్ – స్నేహ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ వేడుకలో డిజైనర్ లుక్ లో కనిపించి స్పెల్ బౌండ్ చేసిన జంట కూడా వీరే.

బాగా పెరిగిన తలకట్టు.. గుబురుగా పెంచిన గడ్డంతో బన్నీ ఎంత మాసీగా కనిపిస్తున్నాడో బ్యూటిఫుల్ స్మైల్ తో స్నేహ అంత క్లాసీగా కనిపిస్తున్నారు ఈ పిక్చర్ పర్ఫెక్ట్ ఫోటోలో. ఈ వేడుక ఆద్యంతం రకరకాల డిజైనర్ దుస్తుల్లో కనిపించింది ఈ జంట.

పుష్ప సెట్స్ నుంచి నేరుగా పెళ్లికి అటెండ్ కావడంతో బన్ని గెటప్ ఛేంజ్ చేయలేకపోయాడు. పుష్ప చిత్రంలో ఎర్రచందనం స్మగ్లర్ గ్యాంగ్ లో డ్రైవర్ గా నటిస్తున్న బన్నీ ఇలా మాస్ లుక్ కి షిఫ్టయిన సంగతి తెలిసిందే. ఆ హెయిర్ స్టైల్ కూడా సంథింగ్ స్పెషల్ గా పెళ్లిలో హైలైట్ అయ్యింది మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here