రష్మిక.. పంచ్ ఇచ్చే ముందు ప్రిపరేషనా..
రష్మిక.. పంచ్ ఇచ్చే ముందు ప్రిపరేషనా..

చూస్తుంటే టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీకుల్లో ఎవరూ ఈ అమ్మడిని టచ్ చేయలేరేమోనని సందేహం కలగక మానదు. సమంత.. రకుల్.. రాశీ ఖన్నా ..లావణ్య త్రిపాఠి.. నిహారిక.. వీళ్లంతా నిరంతరం జిమ్ కి వెళ్లి ఎంతగా శ్రమిస్తున్నారో చూస్తున్నదే. వీళ్లందరికీ సవాల్ విసురుతోందా రష్మిక?
ఇంతకుముందు బీచ్ లో జిమ్ చేసి సర్ ప్రైజ్ చేసిన ఈ అమ్మడు ప్రతిసారీ జిమ్ లో తీవ్రంగా శ్రమించే వీడియోల్ని రివీల్ చేస్తూనే ఉంది. ఇప్పుడిలా కిక్ బాక్సర్ ని తలపించేలా పంచ్ కి ప్రిపరేషన్ మొదలు పెట్టినట్టుగా ఏమిటా ఫోజు?

అయినా మరీ అంతగా ఫోజు కొట్టాలా? అయితే ఈ భంగిమతో నడుము చుట్టూ కొలెస్టరాల్ కంట్రోల్ సాధ్యమేనన్నది ఫిట్నెస్ ట్రైనర్లు చెప్పే మాట. అందుకేనేమో నిష్ఠగా ప్రాక్టీస్ చేస్తోందిలా. తీక్షణమైన చూపులతో కొరకొరా చూస్తూ ప్రత్యర్థిపై పంచ్ కి ప్రిపేరవుతున్నట్టుగా ఉంది మరి. బ్లాక్ షార్ట్.. హుడెడ్ టీస్.. రీబాక్ షూస్.. ఆ ఫోజే వేరులే. మార్షల్ ఆర్ట్స్ క్వీన్స్ కత్రిన.. దిశా పటానీలనే మించిపోతోంది. అన్నట్టు `పుష్ప`లో కండల హీరో బన్నీపైనా పంచ్ లు విసురుతుందా ఏమిటీ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here