అల్లు అర్జున్ గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు.. ఇక సుకుమార్ కూడా తన గత సినిమా రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ ను కొట్టాడు. ఈ ఇద్దరి కలయికలో ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాంటి వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా పుష్ప సినిమాను రూపొందిస్తున్నట్లుగా సుకుమార్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. పుష్ప సినిమాకు పాన్ ఇండియా మెరుగులు అద్దేందుకు దర్శకుడు సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా సినిమాలోని కీలక పాత్రలకు తమిళం మరియు హిందీ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. సినిమా ఆరంభంకు ముందే విజయ్ సేతుపతిని ఒక కీలక పాత్ర కోసం అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల పుష్ప నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నాడు.

ఆయన స్థానంలో వచ్చేది ఎవరు అంటూ గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతుంది. పలువురు హీరోల పేర్లు ప్రచారం జరిగాయి. నారా రోహిత్ నుండి మొదలుకుని తమిళ హీరోల వరకు పలువురు ఆ పాత్రను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. చివరకు సస్పెన్స్ కు తెర దించుతూ తమిళ హీరో ఆర్య ను ఆ పాత్ర కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. గతంలోనే అల్లు అర్జున్ మరియు ఆర్యలు కలిసి నటించారు. మళ్లీ పుష్ప సినిమాలో ఆర్యతో బన్నీ ఢీ కొట్ట బోతున్నట్లుగా తెలుస్తోంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దసరా వరకు సినిమాను విడుదల చేసేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఆర్య షూట్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here