శ్రుతి హాసన్ అంటే గ్లామరస్ హీరోయిన్. అందాల ఆరబోతకు పెద్దగా అడ్డు చెప్పకుండా స్కిన్ షో కూడా చేస్తోందీ బ్యూటీ. అయితే.. చాలా కాలం తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతోంది శ్రుతి. వయసులో పెద్దవాడైన నవలా రచయితకు ప్రియురాలిగా నటిస్తోంది.

‘ది బెస్ట్ సెల్లర్ షయీ రోట్’ అనే నవల ఆధారంగా ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఇందులో.. నిన్నటి తరం బాలీవుడ్ నటుడు తనకంటే రెట్టింపు వయసున్న మిథున్ చక్రవర్తికి జోడీగా శ్రుతి హాసన్ నటించబోతోంది.

ఫేమస్ నవలా రచయితకు అతని అభిమాని అయిన ఓ యువతికి మధ్య జరిగే రొమాంటిక్ లవ్ స్టోరీనే ఈ ‘ది బెస్ట్ సెల్లర్ షయీ రోట్. ఇందులో.. నవలా రచయితగా మిథున్ చక్రవర్తి.. ఆయన ప్రియురాలిగా శ్రుతిహాసన్ నటించనున్నారట.

లేటస్ట్ గా.. మాస్ మసాలా మూవీ ‘క్రాక్’లో ఆడిపాడింది శ్రుతి హాసన్. ఇప్పుడు ఓ ప్రయోగాత్మక సంచలన పాత్ర చేయడానికి సిద్ధమైంది. ముకుల్ అభ్యంకర్ డైరెక్ట్ చేయనున్న ఈ వెబ్ సిరీస్ను.. సిద్ధార్థ్ పి.మల్హోత్రా నిర్మించనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. అయితే.. ఇలాంటి పాత్రను చేయడానికి స్టార్ హీరోయిన్లు అంత ఈజీగా ఒప్పుకోరు. కానీ శ్రుతి ధైర్యం చేసింది. మరి ఈ పాత్రతో శ్రుతి ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందన్నది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here