పారితోషికంలో పవర్ స్టార్ బిగ్ బెట్టింగ్
పారితోషికంలో పవర్ స్టార్ బిగ్ బెట్టింగ్

జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లినా హీరోగా అతడి ఇమేజ్ ఎక్కడా చెక్కు చెదరలేదనడానికి తాజాగా అతడి క్యూలో ఉన్న ప్రాజెక్టులే లైవ్ ఎగ్జాంపుల్. కొంత గ్యాప్ తర్వాత కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్న పవన్ ఆరంభం పింక్ రీమేక్ `వకీల్ సాబ్` కి సంతకం చేశారు. ఆ తర్వాత వెంట వెంటనే నాలుగైదు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆదిత్య శ్రీరామ్.. క్రిష్.. హరీష్ శంకర్.. సాగర్ చంద్ర.. సురేందర్ రెడ్డి ..త్రివిక్రమ్ ఇలా పలువురు దర్శకులు పవన్ కోసం పని చేస్తున్నారు.

ఇక పారితోషికం విషయంలోనూ పవన్ డిమాండ్ వేరు. అతడు ఒక్కో ప్రాజెక్టుకి 50కోట్ల పారితోషికం అందుకుంటున్నారని అంత పెద్ద మొత్తం చెల్లించేదుకు నిర్మాతలు వెనకాడడం లేదన్న టాక్ కూడా ఉంది. వకీల్ సాబ్ కి ఆయన 50-60కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. క్యూలో ఉన్న అరడజను సినిమాలకు కలుపుకుని దాదాపు 300కోట్ల మేర ఆయన పై పారితోషికం రూపంలో బిగ్ బెట్టింగ్ సాగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ కొడితే 80- 100కోట్ల షేర్ తెచ్చే సత్తా పవన్ కి ఉంది. అందుకే నిర్మాతలు ఇంతటి సాహసం చేస్తున్నారని భావించవచ్చు.

వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటించేందుకు పవన్ సన్నాహకాల్లో ఉన్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలోని భారీ పాన్ ఇండియా సినిమా పెండింగ్ షూట్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here