ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ : ఫస్ట్ఇయర్ క్లాసులు ప్రారంభం ... వేసవి సెలవులు రద్దు !
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ : ఫస్ట్ఇయర్ క్లాసులు ప్రారంభం ... వేసవి సెలవులు రద్దు !

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 18న తరగతులు ప్రారంభం అయ్యాయి. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైనందున పనిదినాలు 160 రోజులకు పరిమితం చేశారు. ఆరో తరగతి విద్యార్థులకు కూడా జనవరి 18 నుంచి తరగతులు మొదలైయ్యాయి. 1-5వ తరగతుల ప్రారంభంపై త్వరలో సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశాలు తప్పనిసరిగా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని మంత్రి సురేశ్ తెలిపారు. కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు అమలుచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీలు ఇకపై నిరంతరం జరుగుతుంటాయన్నారు.

ఇంటర్మీడియట్ ఫస్టియర్ క్లాసులు మే 31వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. తాజాగా సవరించిన ఫస్టియర్ అకడమిక్ కేలండర్ను జనవరి 15న విడుదల చేసింది. జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే తరగతులు మొత్తం 106 రోజులు జరగనున్నాయి. రెండో శనివారం కూడా క్లాసులు జరపాలని విద్యాశాఖ అన్ని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా క్లాసులు మొదలయ్యాయి. సుదీర్ఘ విరామం తర్వాత విద్యార్ధులు ఉత్సాహంగా క్లాసులకు వస్తున్నారు.

సిలబస్ పూర్తి చేయడం పరీక్షలు నిర్వహించేందుకుగాను ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేయాలని నిర్ణయించారు. 30 శాతం సిలబస్ను తగ్గించింది విద్యాశాఖ. పరీక్షలు మేలో జరుగుతాయని స్పష్టం చేసింది. ట్రిపుల్ ఐటి విద్యార్థులకు కూడా ఇవాళ్టి నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు ఇవాళ ఉదయంలోపు కళాశాలలో రిపోర్టు చేయాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఆరో తరగతి విద్యార్థులకు కూడా నేటి నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ ఒక పూట తరగతులు జరుగుతున్న పదో తరగతి విద్యార్ధులకు ఇవాళ్టి నుంచి రెండు పూటలా తరగతులు జరుగనున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here