ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బాలయ్య..!
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బాలయ్య..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన తనయులు నందమూరి బాలకృష్ణ – రామకృష్ణ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ”నందమూరి తారకరామారావు చావుపుట్టుకలు లేని మహానుభావుల కోవకు చెందిన వారు. ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తూ అక్కడ అవినీతిని భరించలేక ఉద్యోగాన్ని వదిలేసి చలన చిత్ర రంగంలోకి అడుగు పెట్టారు. ప్రపంచంలో ఎవరూ చేయని చేయలేని పాత్రలను ఆయన పోషించారు. ఆయన్ని చూస్తే ప్రపంచంలోనే అంతటి అందమైన వాడు పుట్టి ఉండడు అనిపిస్తుంది” అన్నారు.

ఇంకా బాలయ్య మాట్లాడుతూ.. భారతీయ సినిమా రంగంలో అగ్ర హీరోగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారని.. శారీరకంగా ఆయన మన ముందు లేకపోయినా స్ఫూర్తి ప్రదాతగా చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి కూడా నివాళులు అర్పించారు. తన ఇంట్లో మనవడు బుల్లి ఎన్టీఆర్ పుట్డాని లక్ష్మీ పార్వతి తెలిపారు. అలానే ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా తన తాతను గుర్తు చేసుకున్నాడు. ”తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధృవ తార మీరే” అని తారక్ ట్వీట్ చేస్తూ తన తాత ఫోటోను షేర్ చేశాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here