నందమూరి హీరో 'దేవినేని' ఫస్ట్ లుక్..!
నందమూరి హీరో 'దేవినేని' ఫస్ట్ లుక్..!

నందమూరి తారకరత్న టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అనేది దీనికి ఉపశీర్షిక. రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి కనిపించనున్నాడు. నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి.ఎం.ఎన్ ఫిలిమ్స్ మరియు ఆర్.టి.ఆర్ ఫిలింస్ బ్యానర్స్ పై జి.ఎస్.ఆర్.చౌదరి – రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు.

‘దేవినేని’ మోషన్ పోస్టర్ ను ‘మా’ అసోసియేషన్ కార్యదర్శి జీవితా రాజశేఖర్ విడుదల చేయగా.. ఫస్ట్ లుక్ ను నిర్మాత దామోదర్ ప్రసాద్ రిలీజ్ చేశారు. ఇందులో తారకరత్న వైలెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో నిర్మాత టి. ప్రసన్నకుమార్ చలసాని వెంకటరత్నం పాత్రలో నటించాడు. విజయవాడలో దేవినేని నెహ్రూ – వంగవీటి రంగాల మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగింది.. దానికి దారితీసిన పరిస్థితులు.. వంగవీటి రంగాని ఎవరు చంపారు అనే అంశాలను ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కోటి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ‘దేవినేని’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here