వంద శాతం ఆక్యుపెన్సీ సమ్మర్ సీజన్ కి సాధ్యమేనా?
వంద శాతం ఆక్యుపెన్సీ సమ్మర్ సీజన్ కి సాధ్యమేనా?

కరోనా మహమ్మారీ సంక్షోభం నుంచి బయటపడేందుకు టాలీవుడ్ చేస్తున్న ప్రయత్నాలకు అన్నివిధాలా ప్రశంసలు దక్కుతున్నాయి. వేరే ఏ ఇతర పరిశ్రమలో చేయని సాహసం చొరవ ఇక్కడ కనిపిస్తోంది. షూటింగులను తిరిగి ప్రారంభించడమే గాక.. థియేటర్లను తెరవడంలో.. రిలీజ్ లకు ముందుకు రావడంలో అన్నివిధాలా టాలీవుడ్ నుంచి చొరవ ఆకట్టుకుంది.

తొలిగా సాయి తేజ్ `సోలో బ్రతుకే సో బెటర్` రిలీజై మంచి ఫలితం అందుకుంది. ఆ తర్వాత సంక్రాంతి బరిలో రిలీజైన నాలుగు సినిమాలు ఫర్వాలేదనిపించాయి. ఆరంభం రవితేజ క్రాక్ మంచి పాజిటివ్ నోట్ తో మొదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలోకి వెళుతోందన్న కబురు ఆశావహ ధృక్పథాన్ని పెంచింది. రామ్ రెడ్ మిశ్రమ స్పందనలు అందుకున్నా వసూళ్లు ఫర్వాలేదనిపించిందని టాక్ వచ్చింది. పండగ కలెక్షన్స్ అందరిలో ధీమాను పెంచాయి.

కరోనా సంక్షోభం నుండి కోలుకున్న మొట్టమొదటిది తెలుగు చిత్ర పరిశ్రమ గా టాలీవుడ్ రికార్డులకెక్కింది. 50శాతం ఆక్యుపెన్సీ ఇతర ఆంక్షల నడుమ ఈ తరహా రిపోర్ట్ రావడం ఆశను పెంచింది. అనువాద చిత్రమే అయినా మాస్టర్ తెలుగు వెర్షన్ ఫర్వాలేదనిపించే వసూళ్లను సాధిస్తోందన్న రిపోర్ట్ హోప్ ని మరింత పెంచుతోంది.

ఏదేమైనా బిజినెస్ పరంగా తక్కువ బడ్జెట్ .. మీడియం బడ్జెట్ సినిమాలకు ప్రతిదీ అనుకూలంగానే కనిపిస్తున్నా.. భారీ బడ్జెట్ సినిమాల విషయంలోనే మార్కెట్ వర్గాల్లో సానుకూలత వ్యక్తం కావడం లేదు. 50శాతం ఆక్యుపెన్సీతో రికవరీ అంత సులువేమీ కాదన్న విశ్లేషణ సాగుతోంది. అయితే థియేటర్లను పూర్తి సామర్థ్యానికి నడపడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చే వరకు నిర్మాతలు పెద్ద బడ్జెట్ సినిమాలను విడుదల చేయలేని పరిస్థితి ఉంది. ఇక కోలీవుడ్ లో వందశాతం ఆక్యుపెన్సీ కోసం ప్రయత్నించిన దళపతి విజయ్.. శింబు వంటి హీరోలు భంగపడిన సంగతి తెలిసినదే. అందుకే ఇప్పుడే వంద శాతం సాధ్యం కాబోదు. కనీసం సమ్మర్ నాటికి వకీల్ సాబ్ లాంటి సినిమాకి వెసులుబాటు లభిస్తుందన్న హోప్ ఉంది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ దశకు సన్నివేశం చేరుకోవడంతో కరోనా భయాలు నెమ్మదిగా దూరం అవుతున్నాయి. పెద్ద టికెట్ సినిమాలకు వచ్చే రాబడిలో ఎక్కువ భాగం విదేశీ మార్కెట్ల నుంచి వస్తుంది. అక్కడ వ్యాపారం కూడా సాధారణ స్థితికి రావాలి. భవిష్యత్ ఆశావహంగా మారుతుందనే ఊహిద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here