అగ్ర తారలు తమ వ్యక్తిగత సంబంధాలు వ్యవహారాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ బాలీవుడ్ స్టార్.. శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ దీనికి భిన్నం. జాన్వీ తన జీవితంలోని ఓ చెత్త అనుభవాన్ని తన అభిమానులతో పంచుకున్నారు.
కథానాయికగా ఫిల్మ్ ఎంట్రీకి ముందు.. జాన్వీ లాస్ ఏంజిల్స్ లో నటశిక్షణలో డిప్లామా చదువుకున్నారు. ఆ సమయంలో తీరిక సమయంలో తన బోయ్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్ళిందట. ఆ సమయంలో అతడు తనను వేధించాడని .. తప్పుడు ప్రపోజల్స్ చేశాడని తెలిపింది. అయితే ఆరోజు ఏదో ఒకవిధంగా అక్కడినుండి తప్పించుకోగలిగారట. ఆ తర్వాత ఇకపై ఎప్పుడూ తన జీవితంలో అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకోవడం బిగ్ రియలైజేషన్.
ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉందన్న ప్రచారం సాగుతోంది. కార్తీక్ – జాన్వీ.. సెలబ్రిటీ పార్టీలతో పాటు హాలిడే జాలీడే ట్రిప్స్ లో కెమెరాలకు చిక్కడంతో ఈ తరహా ప్రచారం సాగుతోంది. సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుత ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రంలో జాన్వి కపూర్ నటిస్తున్నారు. దీంతో పాటు కరణ్ తెరకెక్కించనున్న `తక్త్` అనే భారీ హిస్టారికల్ చిత్రంలోనూ నటించనున్నారు. దోస్తానా 2లోనూ నాయికగా నటిస్తోంది.