ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరీ స్పెషల్ గురూ
ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరీ స్పెషల్ గురూ

తెలుగు స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల కోసం రక్తం దార పోసేందుకు కూడా సిద్దం అన్నట్లుగా ఉంటారు. దాదాపు అందరు టాప్ స్టార్ హీరోల అభిమానులు కూడా వారి వారి అభిమాన హీరో కోసం ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉంటారు. ఈమద్య కాలంలో హీరోల అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు ట్విట్టర్ రికార్డును కట్టబెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు యూట్యూబ్ లో రికార్డును కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరు హీరోల మాదిరిగానే ఆన్ లైన్ రికార్డులపై దృష్టి పెట్టిన ఎన్టీఆర్ అభిమానులు మరో స్పెషల్ పని చేసి అందరి ఫ్యాన్స్ ల్లోకి మేము డిఫరెంట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపుగా రెండున్నర ఏళ్లు అవుతోంది. జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమా కమిట్ అవ్వడంతో సహజంగానే గ్యాప్ ఎక్కువ వస్తుంది. దానికి తోడు ఈసారి కరోనా కారణంగా మరింత గ్యాప్ వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చేప్పటి వరకు మూడు సంవత్సరాలు కూడా ముగుస్తాయి. అందుకే ఎన్టీఆర్ ను తెరపై చూసేందుకు చాలా గ్యాప్ వస్తుందని అప్పుడప్పుడు అభిమానులు కలిసి ప్రత్యేక షో లను ఎన్టీఆర్ పాత సినిమాలను వేయించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం టెంపర్ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ‘జై లవకుశ’ సినిమాను స్క్రీనింగ్ చేయబోతున్నారు.

ఈనెల 22వ తారీకున హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో జై లవకుశ ను ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు అంతా కూడా ఈ షో కు రావాలంటూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ షో ను హౌస్ ఫుల్ చేయడం ద్వారా ఎన్టీఆర్ అభిమానులు వెరీ స్పెషల్ అంటూ పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. పాత సినిమాను మళ్లీ చూసేందుకు ఏకంగా థియేటర్ లో షో వేయించుకోవడం అది కూడా హౌస్ ఫుల్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇది ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే చెల్లిందని అంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here