తేజ ‘అలివేలు మంగ’గా సాయిపల్లవి?
తేజ ‘అలివేలు మంగ’గా సాయిపల్లవి?

ప్రేమకథా చిత్రాలతో తెలుగు తెరపై తనదైన ముద్రవేసి.. ఆడియన్స్ చూపును తనవైపు తిప్పుకున్న దర్శకుడు తేజ. చిత్రం నువ్వు-నేను జయం వంటి చిత్రాలతో సూపర్ హిట్ దర్శకుడిగా మారిపోయారు. అయితే.. ఆ తర్వాత వరుసగా ఆయన్ను పరాజయాలే పలుకరించాయి. ఇటీవల రానా దగ్గుబాటితో తీసిన పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు తేజ.

ఈ క్రమంలోనే ఆయన తెరకెక్కించబోతున్న లేటెస్ట్ మూవీ ‘అలివేలు మంగ వేంకటరమణ’. గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు. అయితే.. ఇందులో హీరోయిన్ గా డ్యాన్స్ బేబీ సాయిపల్లవి ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. చాలా మంది హీరోయిన్లను సంప్రదించినప్పటికీ.. డేట్స్ అడ్జెస్ట్ కాలేదని సమాచారం.

అలివేలు మంగ పాత్ర కోసం టాలీవుడ్లో లీడింగ్ హీరోయిన్లుగా ఉన్న కాజల్ అనుష్క కీర్తి సురేష్ లను తేజ సంప్రదించాడట. కానీ.. వారు బల్క్ డేట్లు ఇచ్చేందుకు కుదరలేదట. దీంతో తాప్సీని సంప్రదించారని తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని కూడా ప్రచారం జరిగింది. కానీ.. ఏమైందో తెలీదు ఇప్పుడు సాయి పల్లవిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ డ్యాన్స్ బేబీ ఖరారైనట్టేనా..? లేక మరెవరైనా వచ్చి చేరతారా? అన్నది చూడాలి.

కాగా.. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ ఇటీవలే పూర్తయింది. ఈ ‘అలివేలు మంగ వేంకటరమణ’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతోంది. త్వరలోనే షూట్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరంలోనే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్. తేజ ‘అలివేలు మంగ’గా సాయిపల్లవి?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here