పిక్ టాక్: సమంత సూపరంతే
పిక్ టాక్: సమంత సూపరంతే

కుర్రాళ్ల గుండెలు లయ తప్పేలా చేయాలంటే అంగాంగ ప్రదర్శనలే చేయాల్సిన పని లేదు. నిండైన దుస్తులతో ఒళ్లంతా కప్పేసి కూడా వారిని కవ్వించొచ్చు. సమంత లేటెస్ట్ లుక్కే ఇందుకు రుజువు. హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఇంటికి తిరిగొస్తున్న సందర్భంగా ఆమె చూపులతో విసిరిన వలపు బాణాలకు కుర్రాళ్లకు గిలగిలా కొట్టేసుకుంటున్నారు. రంగు రంగుల వైబ్రంట్ డ్రెస్ వేసిన సమంత.. తనదైన వయ్యారపు నడకకు తోడు.. షార్ప్ లుక్స్తో వావ్ అనిపిస్తోంది ఈ ఫొటోలో. ముఖానికి మాస్క్ కూడా తొడుక్కోవడంతో ఉన్నట్లుండి చూస్తే ఎవరీ పడుచు పిల్ల అనిపించొచ్చు. కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే అక్కడున్నది 30 ప్లస్ సామ్ అనే సంగతి అర్థమవతుంది.

పెళ్లికి ముందు కంటే కూడా ఈ మధ్య చాలా సెక్సీగా కనిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న సమంత.. మధ్యలో మరీ బక్కచిక్కి కనిపించడం అభిమానులకు నచ్చలేదు. ఐతే ఈ మధ్య వర్కవుట్లు కొంచెం తగ్గించి ఒళ్లు చేసిన సామ్.. చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటో షూట్లు ఫాలోవర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సామ్ జామ్ టాక్ షోతో తీరిక లేకుండా గడుపుతోంది సమంత. తెలుగులో జాను తర్వాత ఆమె మరే సినిమాలోనూ నటించలేదు. తమిళంలో మాత్రం రెండు సినిమాలు అంగీకరించింది. అవి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here