సంక్రాంతి సందర్బంగా రాధేశ్యామ్ సినిమా యూనిట్ సభ్యులు అందరికి కూడా ప్రభాస్ నుండి ఖరీదైన బహుమానం అందింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. ప్రభాస్ ఇచ్చిన సంక్రాంతి కానుకతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంలో మునిగి పోయారు. రాధేశ్యామ్ కు పని చేసే సెట్ బాయ్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు అందరికి కూడా ప్రభాస్ ట్రాక్వ్ బై టైటాన్ వాచ్ లను గిప్ట్ గా పంపించాడు. ప్రతి ఒక్కరికి కూడా వారి ఇంటికి వాచ్ వెళ్లేలా సర్ ప్రైజ్ ను ప్లాన్ చేయడం జరిగిందట. పండుగ సందర్బంగా ప్రభాస్ నుండి ఆ బహుమానం అందడంతో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు.

ప్రభాస్ నుండి టీం కు అందిన కానుక ఏమై ఉంటుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి సమాధానంగా ఈ ఫొటోను రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన ఒక యూనిట్ సభ్యుడు షేర్ చేసుకున్నాడు. ఈ వాచ్ ఖరీదు దాదాపుగా అయిదు వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ పెద్ద మొత్తంలో ఈ వాచ్ లను కొనుగోలు చేసి తన టీమ్ మెంబర్స్ కు ఇవ్వడం జరిగింది. లక్షలు ఖర్చు చేసి తన యూనిట్ సభ్యులందరిని కూడా సంతోషంలో ముంచెత్తిన ప్రభాస్ హృదయం ఎంత మంచిది అంటూ నెటిజన్స్ మరియు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫొటోటాక్ః రాధేశ్యామ్ టీమ్కు ప్రభాస్ గిఫ్ట్ ఇదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here