తెలుగులో కాబోయే స్టార్ హీరోయిన్స్ వీరేనట!!
తెలుగులో కాబోయే స్టార్ హీరోయిన్స్ వీరేనట!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రానురాను పాతనీరు పోయి కొత్తనీరు వచ్చే సమయం దగ్గరపడింది. ఎందుకంటే మొన్నటివరకు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన వారంతా ప్రస్తుతం స్పీడ్ తగ్గించేసారు. ఇక ఈమధ్య ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్లు డెబ్యూ హీరోయిన్లు వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. వారిలో కృతిశెట్టి సాయిపల్లవి కేతిక శర్మ అమృత అయ్యర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాబోయే తరం స్టార్ హీరోయిన్స్ వీరే అంటూ టాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. త్వరలో ఉప్పెన మూవీతో తెలుగుతెరకు పరిచయం కాబోతున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’ పాటతో కుర్రకారు మనసులను దోచుకున్న కృతి.. తాజాగా ఉప్పెన టీజర్ లో తన అందమైన హావభావాలతో మనసులను దోచుకుంటుంది. ఇక ఫస్ట్ సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అందులో ఒకటి శ్యామ్ సింగరాయ్.. ఇక ఉప్పెన హిట్ అయితే గనక తిరుగుండదని అంటున్నారు.

ఇక నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక లవ్ స్టోరీ విరాటపర్వం సినిమాలు రెడీ చేసింది. త్వరలో పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపిస్తుందని టాక్. మరి ఈ భామకు ఒక హిట్ పడినా మేకర్స్ మాత్రం వదిలేలా లేరని చెప్పాలి. అమ్మడు స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తుంది. ఇక కేతిక శర్మ.. త్వరలోనే నాగశౌర్య హీరోగా నటిస్తున్న లక్ష్య సినిమాతో టాలీవుడ్ డెబ్యూ చేయనుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ఆల్రెడీ రొమాంటిక్ అనే సినిమాలో నటిస్తోంది. చూడాలి మరి కేతిక కూడా స్టార్ అవుతుందేమో.. ఇక రీసెంట్ గా డెబ్యూ అయింది తమిళ బ్యూటీ అమృత అయ్యర్. ఈ భామ తాజాగా రెడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అలాగే త్వరలో ’30రోజులలో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో అలరించనుంది. మరి ఈ సినిమాలు లైన్ లో ఉండగానే ప్రస్తుతం ఈ కుర్రభామలు చేతినిండా సినిమాలు రెడీ చేసుకుంటున్నారు. చూడాలి మరి తెలుగువారు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ఆదరిస్తూనే ఉంటారు. ఈ భామలు స్టార్ హీరోయిన్స్ గా ఏలుతారా లేదా చూడాలి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here