మరో ఆలయంపై దాడి..నకిలీవార్తల గుట్టురట్టు
మరో ఆలయంపై దాడి..నకిలీవార్తల గుట్టురట్టు

మరో ఆలయంపై దాడి..నకిలీవార్తల గుట్టురట్టు
ఏలురు పట్టణంలో తాజాగా మరో ఆలయంపై దాడికి సంబంధించిన వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు మంగళవారం ఈ నకిలీ వార్తల రాకెట్టును ఛేదించారు.

ఏలూరులో ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం అని ప్రచారం జరిగింది. దీనిపై విచారించిన పోలీసులు ఈ సంఘటన పాతదని స్పష్టం చేశారు. “సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని తేల్చారు. 2014 నాటి పాత సంఘటనను కొందరు వ్యక్తులు ప్రచార సామగ్రిగా ఉపయోగిస్తున్నారని మా దృష్టికి వచ్చిందని” జిల్లా పోలీసు అధికారి తెలిపారు.

నకిలీ వార్తలను ప్రచారం చేసినందుకు పోలీసులు భారత శిక్షాస్మృతిలోని 153-ఎ 295-ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2014 లో ఆంజనేయ స్వామి విగ్రహ సంఘటన జరిగిందని ఏలురు పట్టణ పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 295 427 కింద కేసు నమోదైందని పోలీసులు స్పష్టం చేశారు. “నిందితుడు పెరక వెంకటేశ్వరరావు(35) ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా చేర్చారు.

ఇదిలా ఉండగా సింగారాయికొండ ఆలయంలోని విగ్రహాలపై తాజాగా కొందరు ‘దాడి’ చేశారు. ఆ ఘటనకు కారణమైన వారిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రత్యేక కేసులో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన 33 మందిని పోలీసులు గుర్తించారు వారిలో ఆరుగురిని దక్షిణాది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అరెస్టు చేశారు.

అన్ని ఆలయాలు.. మత ప్రదేశాల భద్రత కోసం నిఘా వ్యవస్థను 24 గంటలు అందుబాటులో ఉంచారు. పెట్రోలింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ కౌషల్ మంగళవారం పలు ప్రదేశాలను సందర్శించారు. గ్రామ మండల రక్షణ కమిటీల సభ్యులతో సమావేశమై వారి భద్రతపై సూచనలు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం పోలీసు డైరెక్టర్ గౌతమ్ సవాంగ్ రాష్ట్రంలోని ఆలయ సంఘటనలపై అన్ని జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here