కులం పేరుతో పిలిస్తే ఒప్పుకోని జగ్గూభాయ్
కులం పేరుతో పిలిస్తే ఒప్పుకోని జగ్గూభాయ్

ఫ్యామిలీ హీరోగా సుదీర్ఘ కాలం పాటు కెరీర్ లో కొనసాగిన జగపతిబాబు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుసగా విలన్ పాత్రలను క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను చేస్తున్న విషయం తెల్సిందే. జగపతి బాబుకు కులం అంటే నచ్చదట. కొన్ని రోజుల క్రితం కులం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. టాలీవుడ్ లో కులం పేరుతో కొందరు పక్షపాతం చూపించడంతో పాటు ఇంకా పలు విభాగాల్లో కులంను పట్టించుకోవడం విచారకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఈయన మరోసారి తాను కులం అనే జాడ్యంకు వ్యతిరేకిని అంటూ నిరూపించుకున్నాడు.

ప్రస్తుతం జగపతిబాబు కీలక పాత్రలో నటించిన FCUK (ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్) అనే సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ జగపతిబాబును గురించి ప్రస్థావించి చౌదరి అంటూ సంభోదించాడు. వెంటనే జగపతిబాబు కల్పించుకుని నన్ను చౌదరి అనవద్దు.. కులం పేరుతో పిలిస్తే ఒప్పుకోను అంటూ జగపతిబాబుగా పిలవాలంటూ సూచించాడు. దాంతో నిర్మాత దామోదర ప్రసాద్ మార్చుకుని ఆయన్ను వ్యక్తిగతంగా నేను చౌదరి అంటాను. అయితే మీ ముందు మాత్రం జగపతిబాబు అనేందుకు అలవాటు చేసుకుంటాను అన్నాడు. మీడియా ముందు స్టేజ్ పై మాట్లాడుతున్న నిర్మాతను ఆపి తనను చౌదరి అనవద్దంటూ జగపతిబాబు చెప్పాడంటే ఆయనకు కులం విషయంలో ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here