పాడు పనులకు ఆ మాత్రం తీర్పులు వస్తేనే తిక్క కుదురుతుంది
పాడు పనులకు ఆ మాత్రం తీర్పులు వస్తేనే తిక్క కుదురుతుంది

గౌరవనీయ స్థానాల్లో ఉండి.. విలువల్ని మరిచి.. కనీసం మనుషులమన్న విషయాన్ని మర్చిపోతున్న కొందరికి కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడదే పని చేసింది తమిళనాడులోని ఒక కోర్టు. ఆరుగురు విద్యార్థుల్ని లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడికి కఠిన శిక్షను విధించిన తీరు సంచలనంగా మారింది. వయసు మీద పడుతున్న వేళ మరింత హుందాగా వ్యవహరించాల్సింది పోయి అంతూపొంతూ లేని పాడు పనులు చేసిన తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.

యాభై రెండేళ్ల అన్బరసన్ పుదుక్కోట్టై జిల్లాలోని గంధర్వ కోట దువార్ గ్రామంలో టీచర్ గా పని చేస్తున్నాడు. ఆరుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆయనపై హెడ్ మాస్టర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటివేళ.. అతడిపై మహిళా పోలీస్ స్టేషన్ లో టీచరు.. హెడ్మాస్టర్ పైన కంప్లైంట్ అందింది. దీంతో.. పోక్సో చట్టం కింద సదరు కీచక టీచర్ అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ ఉదంతాన్ని విచారించిన మహిళా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

పాడుపని చేసిన టీచర్ కు 49 ఏళ్ల జైలుశిక్షను విధించారు. తన కింద పని చేసే టీచర్ తప్పుడు పని చేస్తే చర్యలు తీసుకోని హెడ్మాస్టర్ జ్ఞానశేఖరన్కు ఏడాది జైలుశిక్ష విధించి తీర్పును ఇచ్చారు. అంతేకాదు.. బాధిత ఆరుగురు విద్యార్థినులకు రూ.1.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. దరిద్రపు పనులు చేసే వారి మీద శిక్షల కొరడా ఈ మాత్రం ఝుళిపించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here