ఆర్ఆర్ఆర్ కొత్త పోస్ట్.. ఎన్నో ప్రశ్నలు
ఆర్ఆర్ఆర్ కొత్త పోస్ట్.. ఎన్నో ప్రశ్నలు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అప్ డేట్ ను తాజాగా ఇచ్చారు. క్లైమాక్స్ షూటింగ్ జరుపుతున్నట్లుగా జక్కన్న టీం అధికారికంగా ప్రకటించింది. దానికి తోడు హీరోలు ఇద్దరు చేతులు పట్టుకున్న ఫొటో కూడా షేర్ చేశారు. ఆ చేతులకు రక్తపు మరకలు ఉన్నాయి. దాంతో ఖచ్చితంగా సినిమాలో వీరిద్దరు భారీ యాక్షన్ సన్నివేశంను ప్రేక్షకుల ముందు ఉంచబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ పోస్ట్ కు రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. పలువురు పలు రకాలుగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంతకు ఫైటింగ్ ఇద్దరు హీరోలు కలిసి వేరే వారితో చేస్తున్నారా లేదంటే ఇద్దరు హీరోలు ఒకరితో ఒకరు ఢీ కొట్టబోతున్నారా అనేది మొదటి ప్రశ్న.

బాహుబలి సినిమాలో ప్రభాస్.. రానాల మద్య ఫైట్ ను అద్బుతంగా చూపించిన జక్కన్న ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోల మద్య ఫైట్ ను ఏమైనా చూపించే అవకాశం ఉందా అంటున్నారు. హీరోలు క్లైమాక్స్ షూటింగ్ కోసం ఒక్క చోటుకు చేరారు అంటూ పోస్ట్ చేశారు కదా ఇంతకు ముందు సీన్ ల కోసం ఒక్కసారి అయినా ఇద్దరు హీరోలు కలిసింది లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. క్లైమాక్స్ లో మాత్రమే ఇద్దరు హీరోలు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించబోతున్నారా అంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ సినిమా స్వాతంత్ర్య పోరాటం కానప్పుడు మరి వీరు పోరాటం చేసేది ఎవరితో అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ తో సినిమాపై రకరకాలుగా కామెంట్స్ వస్తున్నారు. ఎవరి ఊహకు అందింది వారు ఊహించేసుకుంటున్నారు. ఎవరి ఊహ ఎంత వరకు నిజం అయ్యేనో చూడాలంటే ఈ ఏడాది చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందేకంటే జక్కన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here