ఓటీటీలో బెల్‌ బాటమ్‌.
ఓటీటీలో బెల్‌ బాటమ్‌.

కోవిడ్‌ వల్ల థియేటర్స్‌లో రిలీజ్‌ కావాల్సిన సినిమాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది బాలీవుడ్‌లో ఓటీటీలో విడుదలైన తొలి పెద్ద స్టార్‌ హీరో సినిమా అక్షయ్‌ కుమార్‌దే. ఆయన నటించిన ‘కాంచన’ హిందీ రీమేక్‌ ‘లక్ష్మీ’ను డిస్నీ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల చేశారు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ కొత్త చిత్రం ‘బెల్‌బాటమ్‌’ కూడా ఓటీటీలోనే విడుదల కానుందని బాలీవుడ్‌ టాక్‌. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. థియేటర్లు మళ్లీ ప్రారంభమైనప్పటికీ ఓటీటీలో రిలీజ్‌ చేయాలని ఎందుకు అనుకుంటున్నారనే చర్చ బాలీవుడ్‌లో సాగుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన హిందీ చిత్రాల్లో ‘బెల్‌బాటమ్‌’ ముందుంటుంది. ఈ సినిమాలో డిటెక్టివ్‌ పాత్రలో కనిపిస్తారు అక్షయ్‌ కుమార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here