రొంపిచర్ల మండలంలో గోగులపాడు గ్రామంలో బుధవారం నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ డాllచదలవాడ అరవిందబాబు పర్యటించారు.ఆ గ్రామానికి విచ్చేసిన డాllఅరవింద బాబుకు టిడిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు ఏసోబు కుమారుడు స్వామిదాసుకు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు అయ్యాయి.
పేదరికం కారణంగా ఆర్థిక స్థోమత లేక గ్రామంలో ఆర్.ఎం.పి వైద్యుల వద్ద చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న డాllఅరవింద బాబు ఆ కుటుంబమును పరామర్శించి గుంటూరులో గల కార్పోరేట్ హాస్పిటల్ లో వైద్యము కొరకు ఆర్థిక సహాయాన్ని ఏసోబుకు అందజేశారు.ఈ సందర్భంగా డాllఅరవింద బాబు మాట్లాడుతూ పేదరికంలో ఉన్న టీడీపీ నాయకులు,కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని అన్నారు.రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు బాధపడుతున్న ఏసోబు కుమారుడు స్వామిదాసుకు వైద్యం నిమిత్తం అయ్యే నగదును ఇచ్చిన మాట ప్రకారం అందచేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య,గోపు నరసింహారావు,ముండ్రు శివ కోటేశ్వరరావు గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.