కాబోయే కథానాయిక.. సిస్టర్ ఖుషీతో జాన్వీ
కాబోయే కథానాయిక.. సిస్టర్ ఖుషీతో జాన్వీ

శ్రీదేవి- బోనీ కపూర్ ల కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ప్రవేశించడానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. జాన్వీ .. ఆమె సోదరి ఖుషి – తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో స్టైలిష్ చిత్రాలతో నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంటారు.

సిస్టర్స్ ఎప్పటికపపుడు వృత్తిగత వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన చాలా విషయాల్ని సోషల్ మీడియాల్లో రివీల్ చేస్తూనే ఉన్నారు. త్రోబాక్ ఫోటోలు.. ఇంట్రెస్టింగ్ సెల్ఫీలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాల ద్వారా తన అభిమానులను అప్ డేట్ చేసే జాన్వి ఇటీవల మరో స్టైలిష్ ఫోటోని రివీల్ చేశారు.

ఈసారి తన చెల్లెలు ఖుషి కపూర్ తో కలిసి ఉన్న స్పెషల్ ఫోటో.. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఆకట్టుకుంది. ఇద్దరూ క్లాస్సి లుక్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం అభిమానుల్లో ఈ ఫోటో వైరల్ గా మారింది. త్వరలోనే ఖుషీ కపూర్ కూడా కథానాయికగా ఆరంగేట్రం చేయనుందని ఇంతకుముందే బోనీకపూర్ హింట్ ఇచ్చారు. దీంతో అక్కా చెల్లెళ్ల వ్యవహారంపై అభిమానుల్లో ఆసక్తికరంగా ముచ్చటించుకుంటున్నారు. జాన్వీ మరోవైపు కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీ అయిపోయిన సంగతి తెలిసినదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here