విశాఖపట్నం…
గాజువాక…సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ప్రభుత్వ సేవలు ప్రజలకు దగ్గరయ్యాయని అలాగే ప్రజలతో మమేకం అవుతూ ప్రతి ప్రభుత్వ పథకాన్ని అందరికి చేరేలా చేస్తున్న సచివాలయ సిబ్బంది సేవలు అభినందనియమని 66వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి మహ్మద్ ఇమ్రాన్ అన్నారు…
వార్డులోని ఇందిరా కాలనీ,సీతారాం నగర్,బీసీ రోడ్డు సచివాలయంలో సిబ్బందికి సంక్రాంతి కానుకను అందజేశారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలన పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారని అన్నారు.ప్రగతి పౌండేషన్ తరపున రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి సహకారంతో కానుకను ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ SMD గౌస్, సీనియర్ నాయకులు షఫీ,మోతి,SK ఆశ,రాజేష్,లక్ష్మీ,షకీలా,బాషా,ఉమా, సచివాలయ సిబ్బంది, వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు…