పంచ్ వేసి ఇరుక్కున్న ఆహా!
పంచ్ వేసి ఇరుక్కున్న ఆహా!

పంచ్ వేసి ఇరుక్కున్న ఆహా100 పర్సంట్ తెలుగు వినోదం అనే నినాదంలో ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆహా. కరోనా-లాక్ డౌన్ బాగా కలిసొచ్చి ఈ ఓటీటీకి ఉన్నంతలో మంచి ఆదరణే లభించింది. ఈ మధ్య కంటెంట్ పెంచి సబ్స్క్రైబర్లను నిలుపుకునే పెంచుకునే ప్రయత్నంలో ఉంది ఆహా. ఐతే ఈ క్రమంలో కొంచెం దూకుడుగానూ వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో తమ ఓటీటీని చర్చల్లో నిలబెట్టేందుకు చేస్తున్న చర్యలు మాత్రం కొంత వివాదాస్పదం అవుతున్నాయి. ఈ మధ్య అల్లు అర్జున్ సామ్ జామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమోకు సంబంధించిన డిస్క్రిప్షన్లో బన్నీ పేరు ముందు మెగాస్టార్ అని చేర్చడం ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. అందుకు గాను క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మరో వివాదాస్పద ట్వీట్‌తో ఆహా నెటిజన్లకు టార్గెట్ అయింది.

 

నెట్ ఫ్లిక్స్ వాళ్లు తెలుగులో తీసిన తొలి వెబ్ సిరీస్ పిట్ట కథలు టీజర్ లాంచ్ చేసిన సందర్భంగా కొంత హడావుడి జరిగింది సోషల్ మీడియాలో. ఐతే దానికి కౌంటర్‌గా ఆహా వాళ్లు.. మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి. మేం అరుస్తున్నామా అంటూ ట్వీట్ వేయడం వివాదాస్పదమైంది. దీనికి నెట్ ఫ్లిక్స్ వాళ్లేమీ బదులివ్వలేదు కానీ.. నెటిజన్లే గట్టిగా స్పందించారు. నెట్ ఫ్లిక్స్ స్థాయి ఏంటో.. అందులో ఎంత కంటెంట్ ఉంటుందో తెలిసిందే. ప్రపంచంలో మరే ఓటీటీ కూడా అంత కంటెంట్ ఇవ్వదు. దాని ఆదరణ గురించి చెప్పాల్సిన పని లేదు. ఐతే ఆహాలో ఉన్న కంటెంట్ పరిమితం. పైగా తెలుగు కంటెంట్ పేరుతో ఎక్కువగా మలయాళ తమిళ కన్నడ డబ్బింగ్ సినిమాలు పెద్ద సంఖ్యలో తెచ్చి పెట్టేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నెట్ ఫ్లిక్స్‌లో ఉన్న కంటెంట్‌ను ఆహా కంటెంట్‌ను పోలుస్తూ పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఒరవడి బుధవారం మధ్యాహ్నం మొదలై.. సాయంత్రానికి బాగా ఊపందుకుంది. ఇదొక ట్రెండ్ లాగా మారి ఆహా బలహీనతలన్నీ బయటపడే పరిస్థితి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here