ట్రెండీ స్టోరి: మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్న టాప్ హీరోయిన్స్
ట్రెండీ స్టోరి: మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్న టాప్ హీరోయిన్స్

మాతృత్వం అనేది ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. అమ్మతనం అనేది ఆడజన్మకు ఒక వరం. `అమ్మ` అనే పిలుపులో అమృతం ఉంది. పిల్లల కోసం ఆమె పడే తాపత్రయం.. జన్మనిచ్చాక పిల్లలు వృద్ధిలోకి రావడానికి తల్లిగా ఆమె చేసే కృషి అనిర్వచనీయం. ప్రస్తుతం అలాంటి ఒక ప్రత్యేకమైన ఫేజ్ లో ఉన్న పలువురు సెలబ్రిటీల వివరాల్ని సేకరిస్తే .. ఇదీ సంగతి.

2020-21 సీజన్ లో మహమ్మారీ ప్రభావంతో పరిస్థితులు మారిపోయినా.. ఇదే ఏడాది పలువురు సెలబ్రిటీలకు తీపి జ్ఞాపకాల్ని అందించింది. ముఖ్యంగా మాతృత్వం కోసం తపించిన కథానాయికలకు ఆశించినది సిద్ధించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి పలువురు మామ్ అనిపించుకున్నారు.

క్రికెటర్ హార్థిక్ పాండ్యా మోడల్ కం నటి నటాషా స్టాంకోవిక్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. నటాషా బేబి బంప్ ఫోటోలతో పాటు హార్థిక్ బేబీతో ఉన్న స్టన్నింగ్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. నటాషా మమ్మీ అయ్యాక ఎంతో తన్మయానందంలో కనిపించారు.

ఉదయ్ కిరణ్ సరసన పలు తెలుగు చిత్రాల్లో నటించిన అనిత హసనందానీ ఇటీవలే తల్లయిన సంగతి తెలిసిందే. ఇటీవలే బేబి బోయ్ కి జన్మనిచ్చారు అనిత. ప్రస్తుతం మాతృత్వంలోని ఆనందాన్ని ఆస్వాధిస్తున్నారు. బేబి బోయ్ కి రవి అని నామకరణం చేశామని అనిత- రోహిత్ రెడ్డి జంట ప్రకటించారు.

2021 ఆరంభమే విరుష్క జంట పండంటి బిడ్డకు వెల్ కం చెప్పారు. అనుష్క శర్మ బేబి బంప్ ఫోటోలతో పాటు తన వారసురాలి(బేబి గాళ్) ప్రీ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ ఫోటో అంతర్జాలంలో సునామీ సృష్టించింది.

బెబో కరీనాకపూర్ బేబి బంప్ ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలోనే బిడ్డకు జన్మనివ్వనున్నామని కరీనా-సైఫ్ జంట ప్రకటించారు.  పలువురు నాయికలు త్వరలోనే ఆ శుభవార్తను రివీల్ చేయనున్నారని సమాచారం. మరోవైపు కరోనా క్రైసిస్ కి ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మదర్స్ ఎమీజాక్సన్.. కోలే కర్థాషియన్.. తమ వారసులతో పూర్తిగా సెలబ్రేషన్  మూడ్ లో ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here