సమంత డిలీట్ చేసిన ఫోటోలో ఏముంది?
సమంత డిలీట్ చేసిన ఫోటోలో ఏముంది?

సోషల్ మీడియా హుషారుగా ఉంటూ.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు.. సమాచారాన్ని షేర్ చేసుకునే ఆమె..పెట్టే పోస్టులు యమా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి సామ్.. తాజాగా పెట్టిన ఒక ఫోటో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. రోటీన్ కు భిన్నంగా ఉన్న ఈ పిక్ ను పోస్టు చేసిన కాసేపటికే ఆమె డిలీట్ చేశారు. అయితే.. అప్పటికే ఆ ఫోటో వైరల్ గా మారటం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ సమంత డిలీట్ చేసిన ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? అతడిపై సామ్ కాళ్లు వేయటం ఏమిటి? సామ్ షేర్ చేసిన స్టోరీలో ఆమె ఏమని క్యాప్షన్ పోస్టు చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చూస్తే..నాలుగేళ్లుగా సామ్ కు స్టైలిష్ గా వ్యవహరిస్తున్నారు ప్రీతమ్ జుకాల్కర్. తన దగ్గర పని చేసే వారిని చాలా బాగా చూసుకుంటారన్న పేరున్న ఆమె.. మరీ ఇంత సన్నిహితంగా ఉంటారా? అని ఆశ్చర్యపోతున్నారు.

ఒక సోఫాలో పడుకున్న సమంత రిలాక్స్ అవుతున్నట్లుగా ఉంది. ప్రీతమ్ ఆమె కాళ్లను తనపై పెట్టుకున్నాడు.. ఈ ఫోటోకు నాలుగేళ్లుగా కలిసి ఉన్నామన్న కామెంట్ తో పాటు ఒక లవ్ సింబల్ పెట్టారు. అదే ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన ఐ లవ్యూ అని పెట్టారు. ఊహించని విధంగా ఉన్న ఫోటోను షేర్ చేయటంతో అక్కినేని ఫ్యాన్స్ అవాక్కు అయ్యారు. నెగిటివ్ గా రియాక్టు కావటం మొదలు పెట్టారు.

ఏమనుకున్నారో ఏమో కానీ.. సమంత ఈ పోస్టును వెంటనే డిలీట్ చేశారు. ఆ వెంటనే ప్రీతమ్ కూడా తన స్టోరీలో నుంచి తీసేశారు. కానీ.. ఈ ఫోటో అప్పటికే వైరల్ గా మారింది. అభిమానుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందన్న అంచనాతోనే.. ఆమె ఫోటోను డిలీట్ చేసిందంటున్నారు. అయినా.. పోస్టు పెట్టే ముందు ఆలోచించకుండానే ఇలాంటి ప్రైవేటు ఫోటోలు షేర్ చేయటమా? అని పలువురు మండిపడుతున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ ఫోటో తాలుకు పరిణామాలు సమంతను వెంటాడతాయన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here