చైనాకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భారత్..
చైనాకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భారత్..

గత కొంతకాలంగా చైనా .. భారత మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయి. పైగా ఆ ప్రాంతం తమదేనంటూ చైనా వితండ వాదన చేస్తున్నది. ఇప్పటికే పలుమార్లు సరిహద్దు వివాదంపై చర్చలు జరిగాయి. తాజాగా ఆదివారం కూడా చైనా.. భారత్ సైనికుల మధ్య మరోసారి చర్చలు జరిగాయి. అయితే రెండున్నర నెలల తర్వతా ఈ చర్చలు జరిగినట్టు సమాచారం.

చైనా భూభాగంలోని చూషుల్-మోల్దో సరిహద్దు శిబిరం వద్ద ఈ చర్చలు జరిగాయి. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా తన సైన్యాలను పూర్తిగా వెనక్కు మళ్లించాలని ఈ సందర్భంగా భారత్ మరోసారి స్పష్టం చేసింది. అయితే వివాదాస్పద స్థలాల నుంచి వెంటనే సైన్యాన్ని వెనక్కితీసుకోవాలని చైనా సైన్యానికి .. భారత్ సైనికాధికారులు స్పష్టం చేశారట. ఈ విషయంపై చైనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
పాంగాంగ్ సరస్సు చూషుల్ గోగ్రా-హాట్స్పింగ్స్లో చైనా బలగాలను మోహరించింది. అక్కడినుంచి బలగాలను వెనక్కు మళ్లించాలని భారత్ కోరింది.

భారత బృందానికి 14 కార్స్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్ నేతృత్వం వహించగా… చైనా తరఫున దక్షిణ జిన్జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ నేతృత్వం వహించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు.. రాత్రి 8 గంటలకు వరకు కొనసాగాయి. బలగాల ఉపసంహరణ ఉద్రిక్తతల సడలింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత చైనాపైనే ఉందని భారత బృందం స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై చైనా వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
India-has-once-again-given-a-strong-warning-to-China

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here