ఖరీదైన కారు కొన్న యువ నటుడు
ఖరీదైన కారు కొన్న యువ నటుడు

వీడియోలుసినిమాక్రీడలుబిజినెస్ఫ్యామిలీఫోటోలుట్రెండింగ్న్యూస్ బీట్స్
ఖరీదైన కారు కొన్న యువ నటుడు
25 Jan, 2021 08:26 IST

తాను నటించిన సినిమా విజయవంతం కావడంతో తనకు తానే బహుమతి ఇచ్చుకున్నట్లు యువ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌ చెప్పాడు. ఈ సందర్భంగా తాను కొత్తగా కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. లాక్‌డౌన్‌ వలన కారు కొనడం ఆలస్యమైందని తెలిపాడు. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ‘హ్యాపీడేస్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చిన నిఖిల్ ఆ తర్వాత ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందాడు.

గ‌తేడాది ‘అర్జున్‌ సురవరం’ సినిమా విడుదలై విజయవంతమవడంతో ఈ కారు కొన్నట్లు తెలిపారు. కరోనా వలన కారు కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నాడు. దీంతోపాటు గతేడాది త‌న ప్రేయ‌సిని పెళ్లాడాడు. ప్ర‌స్తుతం వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాలపరంగా చూస్తే నిఖిల్‌ కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ- 2, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘18 పేజెస్’ అనే సినిమాలు చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here