బిగ్ అప్డేట్: 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రాజమౌళి..!
బిగ్ అప్డేట్: 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రాజమౌళి..!

[15:14, 1/25/2021] 🧸: బాహుబలి’ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ”ఆర్.ఆర్.ఆర్”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై యావత్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ మన్నెం దొర అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. అలియా భట్ – ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో తిరిగి షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి.. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుతున్నట్లు ఇటీవలే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ అభిమానులకు రాజమౌళి అదిరిపోయే న్యూస్ అందించాడు. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడు.
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని 2021 అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ”మీరు ఎన్నడూ చూడని విధంగా అన్ స్టాపబుల్ ఎనర్జీతో ఫైర్ మరియు వాటర్ కలిసి వస్తున్నాయి! అక్టోబర్ 13 2021 న ఇండియన్ సినిమా ఫైనెస్ట్ అవతారాన్ని ఎక్సపీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి” అని ఆర్.ఆర్.ఆర్ టీమ్ పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ కు సంబంధించిన ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో చరణ్ గుర్రం మీద.. తారక్ బైక్ పై యుద్ధానికి బయలు దేరుతున్నట్లుగా చూపించారు. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని 2020 జులై 30న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వలన 2021 జనవరి 8కి పోస్ట్ పోన్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ ఫైనల్ గా ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ చిత్రంలో అజయ్ దేవగన్ – శ్రియా – సముద్రఖని వంటి స్టార్స్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆర్.ఆర్.ఆర్’ ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here