స్మగ్లర్లు తెలివి మీరారు. పోలీసుల కళ్లుగప్పేందుకు నానా రకాల ప్లాన్స్ వేస్తున్నారు. ఈ తాజా ప్లాన్ ఎలా అమలుచేశారు? పోలీసులు ఎలా కనిపెట్టారు?

హైదరాబాద్ పోలీసుల ముందు అక్రమార్కుల ఆటలు సాగట్లేదు. తాజాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB)… భారీ ఆపరేషన్‌ను తెలివిగా ఛేదించింది. డ్రగ్స్ గ్యాంగ్ ఆట కట్టించింది. హైదరాబాద్‌… లక్డీకాపూల్‌లోని ఓ కొరియర్‌ సర్వీస్‌ ఆఫీసుకి ఓ పార్శిల్ వచ్చింది. దానిపై డౌట్ వచ్చిన ఉద్యోగులు… 2020 నవంబర్ 7న పోలీసులకు కాల్ చేశారు. NCB ఆఫీసర్లు వచ్చి… పార్శిల్ ఓపెన్ చేశారు. షాకింగ్ సీన్. లోపల పిజ్జా, బర్గర్‌, శాండ్‌విచ్‌లు ఉన్నాయి. తీరా వాటిని స్కానింగ్ చేస్తే… వాటిలో డ్రగ్స్ (మత్తు పదార్థాలు) ఉన్నట్లు తేలింది. ఆ గ్యాంగ్ ఏం చేసిందంటే… పిజ్జా, బర్గర్‌, శాండ్‌విచ్‌ ప్యాకింగ్ లోపల డ్రగ్స్ ప్యాకెట్లు అతికించి… ఆ పైన కవర్లు అతికించింది. మొత్తం 4.35 కేజీల మెథకొలైన్‌ మత్తు పదార్థాన్ని పోలీసులు సీజ్ చేశారు. వాటిపై ఉన్న అడ్రెస్ ప్రకారం… వాటిని ఆస్ట్రేలియా పంపేందుకు రెడీ చేసినట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here