జగ్గూభాయ్ సెన్సేషన్ ఫొటో.. షాక్ లో ఫ్యాన్స్!
జగ్గూభాయ్ సెన్సేషన్ ఫొటో.. షాక్ లో ఫ్యాన్స్!

జగపతి బాబు అంటే.. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో ట్యాగ్ లైన్ ఉండేది. ఆ తర్వాత అనివార్య కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన.. తనలోని మరో యాంగిల్ ను చూపిస్తూ రీఎంట్రీ ఇచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెజండ్’ మూవీలో ఫ్యామిలీ హీరో కాస్తా.. మోస్ట్ వయలెంట్ విలన్ గా కనిపించాడు. విలన్ గెటప్ లోని జగపతిబాబుని ఆడియన్స్ ఓన్ చేసుకోవడంతో.. ఇక వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నాడు జగ్గూభాయ్.

ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో ‘FCUK’ (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) సినిమా తెరకెక్కుతుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక.. ఈ సినిమా సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వచ్చేనెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో జగపతి బాబు తండ్రిగా కనిపించనున్నారు.
అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జగ్గూ భాయ్.. తాజాగా ఓ ఫొటోను ట్విటర్ లో షేర్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్రంలో సిలువపై ఉన్న ఏసుక్రీస్తు గెటప్ లో కనిపిస్తున్నారు. తలకు ముళ్ల కిరీటం సివకు మేకులతో కొట్టిన చేతులు రక్తం కారుతున్న ముఖంతో ఈ చిత్రంలో కనిపిస్తున్నారు జగపతి బాబు.

జగ్గూ భాయ్ పోస్ట్ చేసిన ఈ ఫొటో చూసి అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఫోజు ఏదైనా సినిమా కోసం సంబంధించిందా? లేక మరేదైనా కారణంతో పోస్టు చేశారా? అన్నది మాత్రం చెప్పలేదు జగపతి బాబు. అభిమానులు అడిగినా సమాధానం చెప్పలేదు. మరి ఈ చిత్రం వెనకున్న అంతరార్థం తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాలేమో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here