హల్వా ఐస్ క్రీమ్ తింటూ జిమ్ లో ఆ వేషాలేంటి మాస్ రాజా!!
హల్వా ఐస్ క్రీమ్ తింటూ జిమ్ లో ఆ వేషాలేంటి మాస్ రాజా!!

మాస్ మహారాజా రవితేజ లైఫ్ లో ఇంత హ్యాపీ మూడ్ లో ఎపుడైనా ఉన్నాడా..? ఏమో..!! మునుపెన్నడూ లేని జోష్ ఆయనలో స్పష్ఠంగా కనిపిస్తోంది. అందుకు ఈ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం. కసరత్తులు చేసేందుకని జిమ్ కి వెళ్లిన రాజా ఇలా హల్వా ఐస్ క్రీములు తింటూ ఎలా స్టెప్పులేస్తున్నాడో చూశారు కదా?

దటీజ్ మాస్ మహారాజా.. లైఫ్ లో ఎన్ని టెన్షన్లు ఉన్నా తట్టుకుని నిలబడడం.. ముందుకు వెళ్లడం.. అనుకున్నది సాధించడం ఇదీ అతడి పంథా తొలి నుంచీ. కొన్ని వరుస పరాజయాల తర్వాత క్రాక్ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో అదరగొట్టాడు. అందుకు తగ్గ ఫలితాన్ని ప్రజలే ఇచ్చారు.
గోపిచంద్ మలినేని కానీ.. రవితేజ కానీ అసలు సమీక్షకుల్ని తిట్టాల్సిన పనే లేకుండా మంచి రివ్యూలిచ్చారు. ఎంకరేజ్ చేసారు కంటెంట్ బావుందని. క్రైసిస్ అనంతరం డేరింగ్ గా బరిలో దిగినందుకు సంక్రాంతి పండగ అన్నివిధాలా కలిసొచ్చింది క్రాక్ కి. ఇప్పటికే థియేటర్లు పెంచారు. బ్రేక్ ఈవెన్ సాధించేశారు కాబట్టి ఇక అన్నీ లాభాలే. అందుకే ఆ జోష్ అంతగా వర్కవుటవుతోంది. అయినా ఇలా జిమ్ కని వెళ్లి అలా చేస్తావేంటి రాజా? గజర్ హల్వా.. ఐస్ క్రీమ్ తిని వర్కవుట్లు చేయమని కోచ్ ఏమైనా చెప్పాడా? పైగా ఆ స్టెప్పులేమిటో!! వర్కవుట్ల ముందు ఇవి తింటున్నా.. నా ప్రపంచంలో నేను ఉంటా! అంటే కుదురుతుందా?

అన్నట్టు రవితేజ వీరాభిమాని ఒకరు అడ్వాన్స్ డ్ గా ముద్దులిచ్చేస్తూ హ్యాపీ బర్త్ డే చెబుతూ స్వీట్ హార్ట్ అని కూడా పిలిచేసింది. లవ్ యు సోమచ్.. ఇలాగే హాయిగా జీవించాలి.. లాంగ్ టైమ్.. యు ఆర్ మై క్రష్!! అంటూ 52 ఏళ్ల రవితేజకు ప్రపోజ్ చేసేసింది ఆ వీరాభిమాని. పెదవి ముద్దుల ఈమోజీల్ని షేర్ చేసింది రాజాకు. రాజాలో స్వింగు చూస్తే ఫ్యాన్స్ వీరంగం ఇలానే ఉంటుంది మరి. మాస్ మహారాజా ప్రస్తుతం ఖిలాడీ అనే చిత్రంలో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here