శర్వానంద్‌ సినిమాలో పాయల్‌ ‘స్పెషల్‌’..?
శర్వానంద్‌ సినిమాలో పాయల్‌ ‘స్పెషల్‌’..?

‘సీత’ సినిమాలో ‘బుల్లెట్టు మీదొచ్చె బుల్‌రెడ్డి.. రాజ్‌దూత్‌ మీదొచ్చె….’ అంటూ ఓ స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్స్‌ వేశారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఇప్పుడు మరో స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘మహా సముద్రం’ అనే సినిమా తెరకెక్కుతోంది. అదితీ రావ్‌ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఈ సాంగ్‌లో పాయల్‌ స్టెప్స్‌ వేస్తారని సమాచారం. పాయల్‌కి పెద్ద బ్రేక్‌ వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’కి అజయ్‌ భూపతే దర్శకుడు అనే సంగతి గుర్తుండే ఉంటుంది. త్వరలోనే ఈ స్పెషల్‌ సాంగ్‌ను షూట్‌ చేయనున్నారట. ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here