ఎట్టకేలకు దుబాయ్‌లో మొదలైన సర్కారు వారి పాట షూటింగ్..
ఎట్టకేలకు దుబాయ్‌లో మొదలైన సర్కారు వారి పాట షూటింగ్..

ఎట్టకేలకు మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ ఈరోజు దుబాయ్‌లో మొదలైంది.
మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత సర్కారు వారి పాట సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించనున్నాడు. కరోనా కారణంగా సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యులతోనే గడిపిన మహేష్.. ఈరోజు షూటింగ్‌లో పాల్గోన్నాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా షూటింగ్ ఈరోజు దుబాయ్‌లో స్టార్ట్ అయ్యింది. అయితే వాస్తవానికి తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే చేయాలని మొదట అనుకొన్నా, ప్లానింగ్‌లో మార్పు జరిగి, దుబాయ్‌కు వెళ్లింది చిత్రబృందం. ఇక అక్కడే దాదాపు 20 రోజుల పాటు అక్కడ షూటింగ్‌ జరుపుకోనుంది చిత్రబృందం. దుబాయ్‌లో 20 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుంది. అంతేకాదు హైదరాబాద్‌ షెడ్యూల్‌‌లో భాంగా ఫిల్మి సిటీలో ఓ సాంగ్ ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా దీనికి సంబంధించిన సెట్ వర్క్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఈ టైటిల్ సాంగ్ సెట్ తీర్చిదిద్దారట. ఈ పాట టైటిల్ సాంగ్ వస్తోందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here