బంధాలకు మాయదారి జబ్బు పట్టింది.. ఫోన్ ఇవ్వలేదని తండ్రిని చంపిన కూతురు
బంధాలకు మాయదారి జబ్బు పట్టింది.. ఫోన్ ఇవ్వలేదని తండ్రిని చంపిన కూతురు

మనిషన్న వాడు ఏమైపోతున్నాడు? అన్న సందేహం కలిగేలా.. బంధాలకు కొత్త తెగులు పుట్టినట్లు అనిపించే కొన్ని విచిత్రమైన పరిణామాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. చిన్న విషయాలకు సైతం సహనం చచ్చిపోయినట్లుగా చేస్తున్న చేష్టలు ఇప్పుడు షాకింగ్ గా మారుతున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఉదంతం ఈ కోవకు చెందినదే. ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది.చిన్న కారణానికి కన్నతండ్రిని చంపేసిన కూతురు తీరు గురించి తెలిస్తే నోట మాట రాదంతే. అసలేం జరిగిందంటే?

ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ జిల్లాకు చెందిన రామ్ ధనుహర్ భార్యతో కలిసి ఉంటున్నాడు. వారి కుమార్తె సరస్వతిని ఆమె భర్త పుట్టింట్లో వదిలి వెళ్లాడు. అయితే.. తర్వాతి రోజు తన ఫోన్ గురించి కూతురు వెతికితే కనిపించలేదు. తండ్రిని అడిగితే తెలీదన్నాడు. కాసేపటికి కుమార్తె ఫోన్ తానే దాచి పెట్టినట్లుగా చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుమార్తె.. తండ్రిని చితకబాదింది. ఈ క్రమంలో ధనుహర్ చనిపోయాడు.

దీంతో.. ఏం చేయాలో పాలుపోని కుమార్తె.. తండ్రి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచి పెట్టారు. ఈ ఉదంతంలో కుతురికి తల్లి సాయంగా నిలిచింది. అనంతరం వీరిద్దరు ఇల్లు వదిలి పారిపోయారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న ఇరుగుపొరుగు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ తల్లీకూతుళ్లను అరెస్టు చేశారు. చిన్న చిన్నకారణాలకే ఇలా చంపేయటం ఆందోళనకు గురి చేసేదిగా చెప్పక తప్పదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here