విచారణలో పోలీసులకు చుక్కలు చూపించిన ‘మహాతల్లి’
విచారణలో పోలీసులకు చుక్కలు చూపించిన ‘మహాతల్లి’

విద్యాధికులు. సంపన్నులు. ఆ మాటకు వస్తే.. ఎలాంటి కష్ట నష్టాలు లేవు. అదే వారికి శాపమైందా? శారీరక ఆరోగ్యం తర్వాత.. మానసిక ఆరోగ్యం సరిగా లేని వేళ.. రత్నాల్లాంటి ఇద్దరు కూతుళ్లను అత్యంత పాశవికంగా చంపుకున్న చిత్తూరు జిల్లా మదనపల్లె మహాతల్లి పద్మజ వ్యవహారం ఇప్పుడు షాకింగ్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దారుణ మూఢ హత్యలకు సంబంధించి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.

హత్యలు జరిగిన తీరును పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులకు షాకింగ్ సీన్లు కనిపించాయి. ఇక.. విచారణలో పద్మజ పోలీసులకు చుక్కలు చూపించారు. అపరిచితుడు సినిమా కళ్ల ముందు కనిపించింది. స్ల్పిట్ పర్సనాలిటీతో ఆమె వ్యవహారధోరణి ఒక పట్టాన మింగుడుపడని పరిస్థితి.

ఓపక్క ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. అంతలోనే ఆవేదన వ్యక్తం చేసే ఆమె.. మరికాసేపటికి ఆథ్మాత్మిక ప్రవచనాలు పలికే తీరు.. హావభావాలు విచారణ అధికారులకు ‘సినిమా’ కనిపించింది. వివిధ సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఆమె మాటల్లోనే వింటే.. ఆమె మానసిక పరిస్థితి ఏమిటన్నది అర్థం కావటమే కాదు.. హత్యకు గురైన సమయంలో.. ఇద్దరు కూతుళ్లు పడిన నరకయాతన ఇట్టే అర్థమవుతుంది.

హత్యల గురించి సమాచారం తెలుసుకొని ఇంటికి వచ్చిన పోలీసులతోనూ.. తర్వాత విచారణ సమయంలో పద్మజ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..

– ‘లోక కళ్యాణం పూర్తయింది. నాకు ప్రాణం లాంటి బిడ్డలు దైవం చెంతకు చేరుకున్నారు. నేనే శివాను. నేనే దేవున్ని. కరోనా చైనా నుంచి రాలేదు. శివుని వెంట్రుక నుంచే వచ్చింది. నేను శివున్ని అయితే నాకు ఎందుకు కరోనా వస్తుంది? నాకు కరోనా పరీక్ష ఎందుకు’

– ఐ యామ్ నాట్ థీఫ్. ఐ యామ్ లార్డ్డ్ శివ. మరి నన్నెందుకు స్టేషన్కు రమ్మంటున్నారు?

– ‘అలేఖ్య రెండుమూడు రోజుల్లో వస్తుంది. నాకు కలలో కూడా చెప్పింది. మీరే మా ఇంటికి వచ్చి పూజలు అపవిత్రం చేశారు. మధ్యలో ఆపేశారు అందుకే నా బిడ్డలు నాకు దక్కకుండా పోయారు..ఈ పాపం మీదే’

– కరోనా పరీక్షకు ససేమిరా అన్న వేళలో.. నేను చెబుతున్నా.. చేయించుకో అంటూ భర్త పురుషోత్తమనాయుడు చెప్పగా.. పక్కనే ఉన్న కానిస్టేబుల్ మీ భర్త చెబుతున్నారుగా అంటే.. ‘అతను నా భర్త కాదు’ అంటూ ఇంగ్లిషులో ఘాటుగా బదులిచ్చారు.

– నా బిడ్డలు చనిపోయారని మీరు అనుకుంటున్నారు అంతే. వారు బతికే ఉన్నారు

– కలియుగంలో స్త్రీలు నరకం అనుభవిస్తున్నారు. హత్యలు మానభంగాలు అరాచకాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టే క్రమంలో స్ర్తీల మంచికోసం ప్రపంచశాంతికోసం సత్యయుగం రావాలని కోరుకుంటూ ఇంట్లో పూజలు చేశాం

– సార్ ఏం జరిగిందని ఇంతమంది వచ్చారు. వాళ్లు ఫొటోలు తీస్తున్నారు. ఏమండి..ఏమండీ అందరినీ పిలిపించి పూజలు పాడు చేశారే. నువ్వు చేసిన పనే కదయ్యా ఇదంతా. ఈ ఒక్కరోజూ నా బిడ్డలను వదిలేయండి. రేపు కావాలంటే తీసుకొస్తా. ఏమండీ దేవుని రూములోకి షూలు వేసుకుని వెళ్తున్నారు. మన ఇంట్లోకి షూలు వేసుకుని రాకూడదు కదా? ఎంత పవిత్రంగా చూసుకుంటున్నామో తెలియదా’

– వద్దండీ… నా బిడ్డలను బట్టల్లేకుండా చూపిస్తున్నారు. మీ పాదాలకు నమస్కారం చేస్తా. ఈ ఒక్కరోజు వదిలేయండి

– చిన్నపాపకు చిన్నప్పుడు ఆరోగ్యం బాగాలేదు. వైద్యం చేయిస్తే బాగైంది. ఈ మధ్యకాలంలో స్కిన్ ప్రాబ్లమ్ వస్తే ప్రేయర్ చేసిన తరువాత బాగైంది. తిరిగి చర్మంపై బొబ్బలు వస్తే క్షణాల్లోనే మాయమయ్యాయి. నేను కంటితో చూశాను. మాములుగా అయితే బాడీపై ఒక్క క్షణంలో బొబ్బలు వచ్చి వెళ్లిపోతాయా. మేము కళ్లతో చూశాం. అడగండి సార్

– మామూలు బిడ్డలైతే తలపగలకొడితే గంటసేపు బతికి ఉంటారా? మేమనుకున్నవన్నీ తలచి చేపట్టిన పూజలన్నీ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రపంచం స్త్రీలు అంతా బాగుండాలని సత్యయుగం రావాలని పూజలు చేశాం. ఎలా చేయాలో అన్ని ముందుగానే ప్రాక్టీస్ చేశాం. ఇందుకు మా ఫ్రెండ్స్ కొందరు సహకరించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here