ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమీషన్ మధ్య మళ్ళీ కొత్త పంచాయితి మొదలైంది. ఈసారి మొదలైన వివాదం ఏకగ్రీవాలకు సంబందించి. మామూలుగా ఏ ప్రభుత్వమైనా పంచాయితి ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే గ్రామస్ధాయిలో గొడవలు జరగకుండా ఉంటుందని. పంచాయితి ఎన్నికలన్నవి పార్టీల రహితంగా జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసినా పార్టీలతో వ్యక్తులకున్న అఫిలియేషన్ అందరికీ తెలిసే ఉంటంది.
ఈ కారణంగా నామినేషన్ల దగ్గర నుండి గొడవలు జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి అందరు కూర్చుని
సర్పంచుగా ఒకవ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇటువంటి ఏకగ్రీవాలు సహజంగా అధికారపార్టీకి అనుకూలంగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుందనటంలో సందేహం అవసరం లేదు. అయితే చంద్రబాబునాయుడు అండ్ కో మాత్రం పోటీ జరగాల్సిందే అని పట్టుబడుతున్నారు.
ఇదే పద్దతిలో ఇఫుడు ప్రభుత్వం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయితిలకు భారీ ఎత్తున నగదు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. అయితే ఇక్కడే పంచాయితి మొదలైంది. అదేమిటంటే ఏకగ్రీవాలు అవటానికి వ్యతిరేకంగా కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ ఆదేశాన్ని జారీచేశారు. ఏకగ్రీవాల వ్యవహారాలను పరిశీలించేందుకు ఏకంగా ఓ ఐజి స్ధాయి పోలీసు అధికారినే బాధ్యునిగా నియమించారు. నిమ్మగడ్డ ఉద్దేశ్యంలో ఏకగ్రీవాలు జరగకూడదా ? అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ నేత ఏకగ్రీవంగా ఎన్నిక కాకపోతే వెంటనే ప్రతిపక్షాలు ఎన్నికల కమీషనర్ కో లేకపోతే సదరు ఐపిఎస్ అధికారికో ఫిర్యాదు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. మరపుడు ఏమవుతుందో చూడాలి ?
2 వేల జనాభా ఉన్న పంచాయితీలకు రూ. 5 లక్షలు 2 వేల నుండి 5 వేల జనాభా ఉన్న పంచాయితీలకు రూ. 10 లక్షులు 5 వేల నుండి 10 వేల జనాభా మధ్య ఉన్న పంచాయితీలకు రూ. 15 లక్షలు 10 వేలు పైబడ్డ జనాభా పంచాయితీలకు రూ. 20 లక్షలు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ డబ్బులు పంచాయితీల అభివృద్ధికి ఉపయోగపడతాయన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. అంటే ప్రభుత్వమేమో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే నిమ్మగడ్డ వైఖరేమో ఎన్నికలు జరగాల్సిందే అన్నట్లుగా ఉంది. మరి ఈ కొత్త పంచాయితి ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.