హీరో పెళ్లిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరో పెళ్లిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ దావన్ చాలా కాలంగా నటాషా దలాల్ తో ప్రేమలో ఉన్నాడు. కొన్ని నెలల క్రితమే త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించాడు. అన్నట్లుగానే నటాషా దలాల్ తో వరుణ్ దావన్ వివాహం జరిగింది. పెళ్లితో వారి బంధం మరింతగా బలపడింది. వీరిద్దరు కూడా సుదీర్ఘ కాలంగా ప్రేమాయణం సాగించి ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లికి సిద్దం అయ్యారు. వారికి ఎంతో మంది సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాని హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ మాత్రం ఎవరు ఊహించని కామెంట్స్ చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వరుణ్ దావన్ మరియు నటాషాల పెళ్లి ఫొటోను షేర్ చేసిన శ్రద్దా శ్రీనాద్.. మరో మంచి హీరో కూడా పెళ్లి అనే దుమ్ములో పడిపోయాడు. ఆయన్ను మళ్లీ వెండి తెరపై చూడలేం అనేందుకు బాధగా ఉంది. ఆయన భార్య మరియు ఇతర కుటుంబ సభ్యులు ఇకపై హీరోయిన్స్ తో నటించేందుకు ఒప్పుకోక పోవచ్చు. అందుకే ఆయన ముందు ముందు హీరో ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేయాల్సి ఉంటుందేమో. హీరోయిన్ లతో నటించేందుకు ఖచ్చితంగా ఆయన భార్య ఒప్పుకుంటుందనే నమ్మకం లేదు. ఫ్యామిలీ లైఫ్ ను వర్క్ లైఫ్ ను ఆయన ఎలా బ్యాలన్స్ చేస్తాడో చూడాలి. మేము నిన్ను మిస్ అవుతున్నాం వరుణ్ అంటూ శుభాకాంక్షలు తెలిపింది.

శ్రద్దా శ్రీనాథ్ ఈ పోస్ట్ ను సరదాగా పెట్టిందా లేదంటే ఆమెకు వరుణ్ పై ఏమైనా క్రష్ ఉందా అనేది తెలియాల్సి ఉంది. పెళ్లి అయిన ఎంతో మంది హీరోలు హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ సినిమాలు చేస్తున్నారు. మరి వరుణ్ దావన్ విషయంలో ఎందుకు శ్రద్దాకు ఆ అనుమానం ఉందో తెలియడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై శ్రద్దా శ్రీనాద్ కాని వరుణ్ దంపతులు కాని ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో తనకు పెళ్లి పై నమ్మకం లేదన్న శ్రద్దా శ్రీనాధ్ ఇప్పుడు ఇతరులు పెళ్లి చేసుకున్న విమర్శలు చేస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here