బిగ్ అప్డేట్: వైలెంట్ పోస్టర్ తో 'పుష్ప' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన బన్నీ..!
బిగ్ అప్డేట్: వైలెంట్ పోస్టర్ తో 'పుష్ప' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన బన్నీ..!

టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా డీ గ్లామర్ పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘పుష్ప’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు బన్నీ.

‘పుష్ప’ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 13న (13.08.2021) ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో బన్నీ చేతిలో ఒక గొడ్డలి పట్టుకుని వైలెంట్ గా కనిపిస్తున్నాడు. గుబులు గడ్డంతో డీ గ్లామర్ అవతారంలో ఉన్న స్టైలిష్ స్టార్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. అల్లు అర్జున్ – సుకుమార్ – దేవిశ్రీప్రసాద్ కలయికలో ‘ఆర్య’ ‘ఆర్య 2’ సినిమాల తర్వాత వస్తున్న ‘పుష్ప’ పై మంచి అంచనాలే ఉన్నాయి. ‘పుష్ప’తో మరోసారి సేమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని బన్నీ ధీమా వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here