అధరం నుండి నడుము వరకు.. సెల్ఫీతో అల్లాడిస్తున్న పూనమ్!
అధరం నుండి నడుము వరకు.. సెల్ఫీతో అల్లాడిస్తున్న పూనమ్!

హీరోయిన్ పూనమ్ బజ్వా అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి దశాబ్దకాలం దాటినా అమ్మడికి ఇప్పటివరకు సరైన సూపర్ హిట్ పడలేదు. అల్లు అర్జున్ పరుగు మూవీ తర్వాత తెలుగనాట కనిపించడం మానేసింది. అంటే పూనమ్ తెలుగు సినిమాలు మానేసే పదేళ్ల పైనే అవుతోంది. మొదటి సినిమాతో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైంది పూనమ్. మొదట్లో పక్కింటి అమ్మాయి లాంటి క్యారెక్టర్స్ చేసిన ఈ భామ.. తర్వాత గ్లామరస్ పాత్రలతో కుర్రకారును తన అందాల వలలో వేసుకుంది. అమ్మడి దగ్గర అందం ఉంది.. అభినయం ఉంది.. కానీ ఆదరణ కరువైంది. ఎందుకంటే ఇప్పటికి తెలుగులో మాత్రమే కనిపించడం లేదు కానీ తమిళ కన్నడ ఇండస్ట్రీలలో అడపాదడపా కనిపిస్తూనే ఉంటుంది. కానీ పూనమ్ బజ్వా అనగానే తెలుగు ప్రేక్షకులకు పరుగు సినిమాలో లేచిపోయి పెళ్లి చేసుకున్న సుబ్బలక్ష్మి పాత్రే గుర్తొస్తుంది.

ఇదిలా ఉండగా.. సినిమాలు లేకపోతే ఏంటి సోషల్ మీడియా ఉంది కదా.. అంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో పూనమ్ సందేశాలకంటే అమ్మడి అందాల ఆరబోతకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఆ విషయం తెలిసే ఈ వయ్యారి మతులుపోయే విధంగా చీరకట్టులో బికినీలో ఏదైనా స్కిన్ షో చేసేయడానికి సిద్ధంగా ఉంటోంది. ప్రస్తుతం వెండితెర మీద పూనమ్ అందాలను ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారట. అమ్మడు మాత్రం ఇంస్టాగ్రామ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఫోటోషూట్లతో తన మేని అందాలను బయట పెట్టేస్తుంది పూనమ్. తాజాగా అమ్మడు ఓ రేంజ్ సెల్ఫీపోజుతో దర్శనమిచ్చింది. అమాయకత్వంతో అలా నిలబడి సెల్ఫీ తీసుకుంటూ.. తన ఎద సంపద నడుము ఒంపులను కెమెరాలో బంధించింది. అంతే ఒంపులన్నీ బయటపడేలా కెమెరా ఫోజిచ్చే సరికి నెటిజన్ల అల్లాడిపోతున్నారు. అధరాల నుండి నడుము వరకు వయ్యారంగా ప్రదర్శనకు నిలిపింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here