అకస్మాత్తుగా ఊడిపడిన శిశు మహేంద్ర బాహుబలి
అకస్మాత్తుగా ఊడిపడిన శిశు మహేంద్ర బాహుబలి

అమరేంద్ర బాహుబలిని వెనక నుంచి కత్తి పోటు పొడిచి చంపిన అదే కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి వారసుడిని ప్రకటించిన ఘట్టాన్ని మర్చిపోలేం. ఇది వెండితెర మహత్తర సన్నివేశం అయినా కానీ ఆ సన్నివేశంలో కనిపించిన ఆ పసిపాప చరిత్ర లిఖితం. ఇంతకీ ఎవరా శిశు మహేంద్ర బాహుబలి? అంటే…

ఇపుడు అకస్మాత్తుగా ఇలా ప్రత్యక్షమైంది. ఇదిగో నాటి శిశువు ఇంతింతై అన్న చందంగా ఎదిగేస్తోంది! అంటూ నేరుగా ఫోటోనే అంతర్జాలంలో వైరల్ చేస్తున్నారు. బిడ్డ పుట్టిన వెంటనే కట్టప్ప తన చేతుల్లోకి తీసుకున్న ఆ శిశువు మహేంద్ర బాహుబలి. శిశువుగా నటించిన కిడ్ తన్వి. ఇప్పుడు తన్వి ఎగువ కిండర్ గార్టెన్ స్టడీస్ చేస్తోంది. తనను ఇప్పుడు చూస్తే శిశువుగా ప్రభాస్ పాత్ర పోషించిన అమ్మాయేనా? అని ఆశ్చర్యపోతారు. తన రూపం ఎంతో క్యూట్ గా లవ్ లీగా కనిపిస్తోంది.

తన్వి పెద్దయ్యాక తన లైఫ్ టైమ్ గుర్తుందిపోయే మెమరీగా బాహుబలి చిత్రం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్లాస్ లో తన స్నేహితులు సైతం దీనిపై ముచ్చటించుకుంటే అది తనకు గర్వకారణమే. తన్వి పేరెంట్ కి ఇది గొప్ప అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంతకీ తన్వీ పెద్దయ్యాక ఎలా ఉంటుందో ఊహారూపం తెలియదు కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం తనని నటనారంగంలోకి కచ్ఛితంగా ఆహ్వానిస్తారు. ఇక్కడ జేజేలు పలకడం ఖాయం. శిశు బాహుబలిని చూడాలనుకుంటే ఇదిగో ఆ ఛాన్స్ మీకోసం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here