ఫస్ట్ లుక్: రక్తంలోనే దేశభక్తిని కలిగిన 'సన్ ఆఫ్ ఇండియా'
ఫస్ట్ లుక్: రక్తంలోనే దేశభక్తిని కలిగిన 'సన్ ఆఫ్ ఇండియా'

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటిస్తున్న దేశభక్తి చిత్రం ”సన్ ఆఫ్ ఇండియా”. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సరికొత్త జోనర్ లో.. ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ ఫుల్ రోల్ లో మోహన్ బాబు కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో ప్రగ్యాజైశ్వాల్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘సన్నాఫ్ ఇండియా’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

‘రక్తంలోనే దేశభక్తిని కలిగిన సన్ ఆఫ్ ఇండియాను కలవండి’ అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. మెడలో రుద్రాక్ష వేసుకుని ఉన్న మోహన్ బాబు లుక్ ఆకట్టుకుంటోంది. గతంలో ఎన్నో సందేశాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు మరోసారి దేశభక్తిని చాటిచెప్పబోతున్నారని తెలుస్తోంది. మేస్ట్రో ఇళయరాజా సంగీత స్వరాలు అందిస్తోన్న ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు స్వయంగా స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు మరియు తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాస్తున్నారు. మోహన్ బాబుకు స్టైలిస్ట్ గా ఆయన కోడలు విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం. సుద్దాల అశోక్తేజ పాటలు రాస్తుండగా.. గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా చిన్నా పనిచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here